'మ్యాజిక్' తో జెర్సీ డైరెక్టర్ సర్ప్రైజ్?

Purushottham Vinay
ప్లాపుల్లో ఉన్న సుమంత్ తో 'మళ్ళీ రావా' లాంటి లవ్ స్టోరీ సినిమా తీసి హిట్ కొట్టి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. తరువాత నానితో 'జెర్సీ' లాంటి ఫీల్ గుడ్ సినిమా తీసి డైరెక్టర్‌గా బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు అనేక రకాల ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. జెర్సీ సినిమా నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది.ఇక ఇదే సినిమాను బాలీవుడ్‌లో కూడా రీమేక్ చేసి అక్కడ మాత్రం ప్లాప్ అందుకున్నాడు గౌతమ్.అయితే జెర్సీ వచ్చి 5 సంవత్సరాలు అయిన తెలుగులో గౌతమ్ నుంచి ఇంకో సినిమా రాలేదు. ఇక గత ఏడాది టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో గౌతమ్ VD12 అంటూ ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ తో చెయ్యాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అవ్వడంతో విజయ్ దేవరకొండతో ఈ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పటి దాకా పట్టాలెక్కలేదు. 



ఒకవైపు విజయ్ తన ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అవుతుంది. అయితే ఈ గ్యాప్‌లో గౌతమ్ తిన్ననూరి తన తాజా ప్రాజెక్ట్‌ను కూడా అనౌన్స్ చేశాడు.తన దర్శకత్వంలో వచ్చే నెక్స్ట్ సినిమా మ్యాజిక్ అంటూ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేశాడు. ఈ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ ఫస్ట్ లుక్ ని గమనిస్తే.. సంగీతం నేపథ్యంలో ఈ మూవీ రానుండగా కొత్త నటి నటులతో ఈ సినిమా తీయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీని సితార ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తుండగా.. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు. ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో 2024 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు. సంగీత నేపథ్యం ఉన్న సినిమా పైగా అనిరుద్ లాంటి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: