బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో ఇప్పటి వరకు 16 సీజన్లు పూర్తి చేసుకుంది.ఈ రోజుతో 17వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. బిగ్ బాస్ సీజన్ 17 ఈ రోజు (జనవరి 28) ఫినాలే జరగనుంది. అయితే... ఈసారి కప్ కొట్టే రేసులో చివరి వరకు ఆరుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. వీరిలో బాలీవుడ్ బ్యూటీ మన్నార్ చోప్రా కూడా ఉంది. తెలుగు మరియు హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మన్నారా చోప్రా బాలీవుడ్ అగ్ర హీరోయిన్ ప్రియాంక చోప్రా కజిన్ అవుతుంది. సీజన్ 17 లో మన్నారా తన ఆటతీరుతో అందరినీ ఎంతగానో ఆకట్టుకుని ఫైనల్ 6లో చోటు సంపాదించుకుంది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో మన్నారా చోప్రా పై ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.టాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా దాస్ కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మన్నారా చోప్రాతో తనకు మధ్య జరిగిన గొడవ గురించి చెప్పింది. 'జిద్' అనే మూవీలో ఈ ఇద్దరు కలిసి నటించారు. షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాల్లో మన్నారా తనను నిజంగానే కొట్టిందని, ఆమె వల్ల గాయాలపాలయ్యానని చెబుతూ మన్నారా ప్రవర్తనపై శ్రద్ధా విమర్శలు చేసింది. అంతే కాదు... షూటింగ్ టైంలో మన్నారా ప్రవర్తనను తన సోదరీ ప్రియాంక చోప్రా కూడా సమర్థించిందని ఆ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొంది. దీంతో శ్రద్ధా దాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. దీంతో ఇది కాస్త వివాదంగా మారింది.బిగ్ బాస్ 17 ఫినాలేకి ముందు శ్రద్ధా దాస్ తన ఇన్స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. "మన్నారా చోప్రాపై కానీ, ఆమె ఫ్యామిలీపై కానీ నేను ఏ మీడియా వ్యక్తికి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కనీసం నేను పర్సనల్ పీఆర్వోని కూడా పెట్టుకోలేదు. నేను కావాలనుకుంటే సోషల్ మీడియా లేక ఇన్స్టాగ్రామ్ లో వీడియో రిలీజ్ చేసి నాకు కావలసినంత పబ్లిసిటీని పొందుతాను. కానీ నేను అలాంటి పనులు చేయను. ఈ విషయంలో చాలా బాధ పడ్డాను. కానీ వీటన్నింటికీ నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను" అని తన పోస్ట్ లో పేర్కొంది. దీంతో శ్రద్ధా దాస్ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది.