మరో పాన్ ఇండియా మూవీలో.. ఛాన్స్ కొట్టేసిన శ్రీదేవి కూతురు?

praveen
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని బాలీవుడ్ వాళ్లు కాస్త చులకనగా చూసేవారు. ఇక ఇక్కడి సినిమాలను కూడా అక్కడ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఎప్పుడైతే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఇండియాలోని అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ అయి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపును సంపాదించుకుందో.. అప్పటి నుంచి అందరు చూపు సౌత్ ఇండస్ట్రీ వైపు మళ్ళింది. అయితే బాహుబలి తర్వాత ఇక అందరూ హీరోలు కూడా ఇలాంటి బ్లాక్ బస్టర్ లను సాధిస్తూ  బాలీవుడ్ స్టార్లను సైతం షాక్ కి గురి చేశారు. అయితే బాలీవుడ్ లో ఎంతో మంది సార్లు వరుస ప్లాపులతో సతమతమవుతుంటే.. సౌత్ స్టార్లు మాత్రం బాలీవుడ్ లో కూడా ప్రేక్షకులను అలరిస్తూ అక్కడ విజయాలను అందుకుంటూ ఉండటం గమనార్హం.

 ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీ అంటేనే చులకనగా చూసిన బాలీవుడ్ స్టార్లు ఇక ఇప్పుడు సౌత్ మూవీలలో ఒక చిన్న పాత్ర దొరికిన చాలు అని అనుకుంటూ ఉన్నారు. ఈ కాలంలోనే అక్కడి స్టార్ హీరోలు ఇక్కడి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా నటిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే అటు స్టార్ హీరోయిన్లు కూడా సౌత్ లో ఎంతో మంది హీరోల సరసన నటిస్తూ ఉన్నారు. ఇక బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ సైతం ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో నటిస్తుంది ఈ సొగసరి. అయితే ఇక తాను సౌత్ లో నటిస్తున్న మొదటి సినిమా విడుదల కానేలేదు అంతలోనే మరిన్ని అవకాశాలను దక్కించుకుంటుంది ఈ హీరోయిన్.

 కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో రాబోతున్న పాన్ ఇండియా సినిమా కర్ణాలో కూడా జాన్వి కపూర్ హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. రాకేష్ ఓం ప్రకాష్ దర్శకత్వంలో మహాభారతం ఆధారంగా ఈ సినిమా రూపొందుతూ ఉంది. అయితే ఇందులో సూర్య కర్ణుడి పాత్రలో కనిపించబోతున్నాడట. అయితే సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. ఇకపోతే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా జాన్వి కపూర్ కి సౌత్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకముందే వరుస అవకాశాలు వస్తు ఉండటం చూసి ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: