రణబీర్ కపూర్ 'రామాయణం'లో.. విజయ్ సేతుపతి.. ఏ పాత్రలో తెలుసా?

praveen
రామాయణం ఆధారంగా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇందులో కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయితే.. ఇంకొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను మెప్పించలేక విమర్శలు ఎదుర్కొన్నాయి. అలాంటి వాటిలో ప్రభాస్ హీరోగా వచ్చిన ఆది పురుష్ సినిమా కూడా ఒకటి. ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఏకంగా హీరో హీరోయిన్లను పెట్టి సినిమాలో తోలుబొమ్మలను చూపించారు అంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి. రామాయణాన్ని వక్రీకరించే విధంగానే ఓం రౌత్ ఆది పురుష్ మూవీ ఉంది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి.

 అయితే ఆది పురుష్ సినిమా ఫ్లాప్ తర్వాత ఇంకెవరూ కూడా నేటి తరం డైరెక్టర్లు ఇక రామాయణం నేపథ్యంలో సినిమా తీయడానికి సాహసం చేయరు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఇక ఇప్పుడు మరో డైరెక్టర్ రామాయణం తీసేందుకు సిద్ధమయ్యాడు. దంగల్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నితీష్ తివారి ఇక ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రామాయణం సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీలో రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తూ  ఉండగా.. కన్నడ హీరో యష్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

 ఈ సినిమాలో ఒక్కో పాత్రకు సంబంధించి అప్డేట్ బయటికి వస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇలాంటి అప్డేట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఏకంగా ఈ మూవీలో విలక్షణ నటుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా నటించబోతున్నాడట. ఈ వార్త వైరల్ గా మారిపోవడంతో అతను ఏ పాత్రలో నటించబోతున్నాడు అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఏకంగా విభీషణుడి పాత్రలో రామాయణం సినిమాలో కనిపించబోతున్నాడట విజయ్ సేతుపతి. అయితే ఏ పాత్ర ఇచ్చిన ఆ పాత్రకి ప్రాణం పొసే ప్రతిభ ఉన్న విజయ్ సేతుపతి.. ఇక విభీషణుడి పాత్రతో మెప్పించడం ఖాయమనీ అభిమానులు కూడా అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: