భారీ వసూళ్లు తెచ్చిపెడుతున్న మలయాళ సూపర్ స్టార్ మూవీ....!!

murali krishna
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, సోనాలి కులకర్ణి నటించిన చిత్రం మలైకొట్టై వాలిబాన్ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమా హిట్ టాక్ దూసుకెళ్తున్నది.ఈ సినిమాను షిబై బేబీ జాన్, అచ్చు బేబీ జాన్, విక్రమ్ మెహతా తదితరులు నటించిన ఈ చిత్రం తొలి రోజు భారీ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 25వ తేదీన రిలీజైన ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్లు, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే మలైకొట్టై వాలిబాన్ చిత్రాన్ని సుమారుగా 40 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషనల్, ఇతర ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ 60 కోట్ల రూపాయలని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అన్ని భాషల్లో దాదాపు 50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. సుమారు 55 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
మలైకొట్టై వాలిబాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ భారీ స్పందన కనిపించింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 2 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కేరళలో 3.5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా రిలీజ్‌కు ముందే 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.మలైకొట్టై వాలిబాన్ చిత్రం తొలి రోజు రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 5.5 కోట్లు, కేరళలోని 6 కోట్లతో కలిపి ఇండియా వైడ్ 6.5 కోట్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా 12 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.ఇక రెండో రోజు మలైకొట్టై వాలిబాన్ కలెక్షన్లు కాస్త తగ్గినప్పటికీ బాక్సాఫీస్ వద్ద స్టడీగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా కేరళలో 3 కోట్ల రూపాయలు నికర వసూళ్లను అలాగే 6 కోట్ల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా సాధించింది. దాంతో రెండు రోజుల్లో ఈ సినిమా 18 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: