అలా చేస్తే NBK 109 తో బాలయ్య కి మరో బ్లాక్ బస్టర్ ఖాయం..!?

Anilkumar
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వీర సింహారెడ్డి భగవంత్ కేసరి వంటి సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను తన కథలు వేసుకున్నాడు. ప్రస్తుతం తన తదుపరి సినిమాతో బిజీగా ఉన్నాడు. మాస్ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతోంది. వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు బాబి దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన దగ్గర షూటింగ్ స్టార్ట్ చేశారు మేకర్స్. మొదటిసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఊర మాస్ గా ఉండబోతోంది అని అంటున్నారు.


ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారట. అంతే కాదు ఈ సినిమాలో ఇటీవల యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాబి డియోల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల సినిమా షూటింగ్లో కూడా జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు బాలకృష్ణ  బాబీ డియోల్ మధ్య సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది.ప్రస్తుతం ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్‌గా షూటింగ్‌ కానిచ్చేస్తున్న మేకర్స్..రిలీజ్‌ డేట్‌ విషయంలోనూ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమా మొదలు పెట్టె ముందు దసరాకి రిలీజ్‌ చేయాలని ఫిక్స్ అయ్యారు.


కానీ ఈ సినిమా మే లేదా జూన్‌ నెలలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో మేకర్స్ క్లారీటీగా లేరు. కొరటాల -ఎన్టీఆర్ దేవర మూవీ ఏప్రిల్ 5 న రిలీజ్ ప్రకటించారు. కానీ, ప్రస్తుతం ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. ప్రభాస్ కల్కి మే 9న వస్తుందని మేకర్స్ తెలిపారు. ఆగస్టు 15 న పుష్ప 2, గేమ్ ఛేంజర్ మూవీస్ వస్తున్నప్పటికీ ..పోస్ట్ పోన్ అవుతాయంటూ సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది.  అయితే ఏప్రిల్ లో ఏపీ ఎలక్షన్స్ పూర్తయ్యాక..వెండితెరపై పడే పెద్ద సినిమా బాలయ్యదే అంటూ టాక్ వినిపిస్తోంది. మరి NBK 109 రిలీజ్ విషయంపై..త్వరలో మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: