మహేష్ బాబు సినిమాలో నటించిన ఈ బుడ్డోడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?

praveen
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోల చిన్నప్పటి పాత్రలో నటించి చైల్డ్ ఆర్టిస్టులుగా ప్రేక్షకులను అలరించిన వాళ్ళు ఆ తర్వాత కాలంలో మాత్రం పెద్దయ్యాక ఏకంగా హీరోలుగా కూడా ప్రేక్షకులను మెప్పించిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో మొదటగా మాట్లాడుకోవాల్సి వస్తే తేజ సజ్జ గురించి మాట్లాడుకోవాలి. అప్పుడెప్పుడో ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చిన్నప్పటి పాత్రలో నటించాడు. కేవలం ఒక్కటేనా ఇక ఎన్నో సినిమాల్లో నటించాడు తేజ. ఇక ఇప్పుడు హీరోగా కూడా సూపర్ సక్సెస్ అవుతున్నాడు. ఇటీవల హనుమాన్ అనే మూవీతో ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 ఇక హీరోయిన్లలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా నటించి ప్రేక్షకులను మెప్పించిన కావ్య కూడా ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తూ ఉంది అని చెప్పాలి. ఇలా చాలామంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి మెప్పించిన వారు.. ఇప్పుడు హీరో హీరోయిన్లుగా ఉన్నారు. అయితే ఇక ఇప్పుడు మరో బుడ్డోడు ఇలా ఇండస్ట్రీలో హీరోగా పరిచయమయ్యాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పటికి ఈ సినిమా టీవీలో వచ్చిన కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఈ సినిమాతో మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ మ్యాజిక్ చేశాడు అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ అందరికీ గుర్తుండే ఉంటుంది.

 సినిమాలో హీరో హీరోయిన్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ చూసేది ఈ బుడ్డోడే. అయితే అతడు సినిమాలో దీపక్ చాలా సీన్స్ లో కనిపిస్తాడు. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన దీపక్ ఇప్పుడు హీరోగా మారిపోయాడు. కొత్త డైరెక్టర్ యశస్వి దర్శకత్వంలో దీపక్ సరోజ్ హీరోగా  సిద్ధార్థ రాయ్ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవల లాంచ్ చేశారు. ఏకంగా అర్జున్ రెడ్డి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు   ఈ ట్రైలర్ చూస్తే గుర్తుకు వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. మరి దీపక్ ఎంతలా హీరోగా సక్సెస్ అవుతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: