మళ్లీ జంటగా కనిపించబోతున్న ఆలియా, రణబీర్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..!?

Anilkumar
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. ఇక ఈ హీరో హీరోయిన్లు జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా 2022లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అప్పటివరకు వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న బాలీవుడ్ కి ఈ సినిమా కాస్త ఊరట ఇచ్చింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. తాజాగా ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్


కూడా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆలియా భట్ కి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన గంగుబాయి సినిమాకి దర్శకత్వం వహించాడు సంజయ్ లీలా. ఇప్పుడు కూడా ఆలియా భట్ తో మరొకసారి సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ కూడా ఈ లో నటిస్తున్నారు. అయితే సంజయ్ ఎప్పటిలాగే కొత్త తరం కథతో ఈ ఉంటుందని అంటున్నారు. ఆలియా, రణ్‌బీర్‌, విక్కీ కౌశల్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'లవ్‌ అండ్‌ వార్‌'.


ఈ ట్రయాంగిల్ లవ్ నేపథ్యంలో సాగుతుందనే వినిపిస్తున్నాయి. సంజయ్ లీలా బన్సాలీ హిస్టారికల్ లేదా రెట్రో తరహా లు చేసేవారు. అయితే 'లవ్ అండ్ వార్' కొత్త తరం కథాంశంతో సాగుతుంది. అలాగే సంజయ్ లీలా బన్సాలీ ల్లో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని యాక్షన్ కి ఈ లో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ సంజయ్ లీలా బన్సాలీ కొత్త చిత్రంలో నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ముంబైలోని సంజయ్ లీలా బన్సాలీ కార్యాలయం ముందు అల్లు అర్జున్ కూడా కొన్ని సార్లు కనిపించాడు. అల్లు అర్జున్‌తో సంజయ్ ఈ గురించి చర్చించాడని, ఇప్పుడు విక్కీ కౌశల్‌కి ఆ అవకాశం వచ్చిందని అంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: