నా సామిరంగ సక్సస్ ను పరిశీలిస్తున్న ఇండస్ట్రీ వర్గాలు !

Seetha Sailaja
సంక్రాంతి రేస్ కు విడుదలైన టాప్ హీరోల సినిమాలలో ఒక్క ‘నా సామి రంగ’ తప్ప మిగిలిన రెండు టాప్ హీరోల సినిమాలు బయ్యర్లకు నిరాశపరిచాయి అన్నవార్తలు వస్తున్నాయి. ఎవరు ఊహించని విధంగా చిన్న సినిమాగా విడుదలైన ‘హనుమాన్’ పెద్ద హిట్ గా మారి ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేస్తూ 300 కోట్ల కలక్షన్స్ మార్క్ కు దరిచేరడంతో సినిమా మేకింగ్ విషయంలో అనేక చర్చలు ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి.

సంక్రాంతి రేస్ కు విడుదలైన ‘నా సామి రంగ’ ఏవరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆమూవీ బయ్యర్లు లాభాల బాట పట్టడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈసినిమాను కొనుక్కున్న బయ్యర్లు ఇలా లాభాల బాట పట్టడం వెనుక నాగార్జున ఈసినిమా మేకింగ్ విషయంలో అనుసరించిన వ్యూహాలు అని అంటున్నారు.

ఈసినిమాను మీడియం రేంజ్ బడ్జెట్ లో పూర్తి చేయడమే కాకుండా ఈసినిమాను కేవలం 85 రోజులలో పూర్తి చేయడంతో ఈమూవీ ప్రొడక్షన్ కాస్ట్ బాగా తగ్గింది అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈమూవీకి సంబంధించి సంగీత దర్శకత్వం వహించిన ఎమ్ఎమ్ కీరవాణి ఈసినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కేవలం 15 రోజులలో పూర్తి చేయడంతో ఈమూవీ మేకింగ్ ఖర్చులు కూడ బాగ తగ్గాయి అని అంటున్నారు.

ఈసినిమాకు దర్శకుడుగా పనిచేసిన విజయ్ బిన్నీ కొరియోగ్రాఫర్ కావడంతో పాటల చిత్రీకరణ విషయంలో కూడ ఎక్కడా వృధా ఖర్చులు లేకుండా పాటల చిత్రీకరణను వేగంగా పూర్తి చేయడం కూడ ఈసినిమా విజయానికి సహకరించింది అన్న అభిప్రాయాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ముఖ్యంగా స్క్రిప్ట్ మేకింగ్ వ్యవహారంలో నాగార్జునకు ఉన్న అపారమైన అనుభవంతో ఎక్కడా వృధా సీన్స్ లేకుండా నాగ్ చాల ముందు చూపుతో వ్యవహరించడంతో ఎడిటింగ్ లో ఈమూవీకి సంబంధించిన అనవసరపు సన్నివేశాలు కేవలం 6 నిముషాలు మాత్రమే కట్ చేశారు అని అంటున్నారు. ఇలా అన్నివిషయాలలను ఈసినిమా ఇండస్ట్రీ వర్గాలకు ఒక కేస్ స్టడీగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: