ఏంటీ.. ప్రభాస్ క్రేజీ మల్టీస్టారర్ చేయబోతున్నాడా?

praveen
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ అనే సినిమాతో బాక్సాఫీస్ వద్ద గర్జించాడు. ఏకంగా సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ప్రభాస్ నటించిన ఇంకొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకేకుతున్న కల్కి, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమాలు కూడా విడుదలకు రెడీగా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయ్.

 అయితే ఈ సినిమాల తర్వాత మరికొంతమంది డైరెక్టర్లతో అటు ప్రభాస్ ఇప్పటికే కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ ఒక వార్త తెర మీదికి వచ్చిన.. ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఇప్పటివరకు బయటకి రాలేదు. అయితే టాలెంట్ ఉన్న కొత్త డైరెక్టర్లకు ప్రభాస్ ఛాన్సులు ఇస్తూ ఉన్నాడట. అదే సమయంలో ఇక డిఫరెంట్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడట ప్రభాస్. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.

 ప్రభాస్ మరో స్టార్ హీరోతో కలిసి ఇలా హను రాఘవపూడి తో సినిమా చేయబోతున్నాడట. అంటే ఏకంగా క్రేజీ మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కపోతుంది అని చెప్పాలి. అయితే ఆ స్టార్ హీరో టాలీవుడ్ లో ఉన్న బడా హీరోలలో ఒకరు అన్నది సమాచారం. దీంతో ఆ స్టార్ హీరో ఎవరు అన్నది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కానీ టాలీవుడ్ లో ఉన్న ఒక స్టార్ హీరోతో కలిసి ప్రభాస్ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నాడు అన్న వార్త మాత్రం ఇక సోషల్ మీడియాను ఊపేస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ మల్టీస్టారర్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునేందుకు ప్రభాస్ ఫాన్స్ అందరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: