'యానిమల్' లో రణబీర్ ఇంటిమేట్ సీన్స్ చేయడానికి.. భార్య ఆలియా భట్ కారణమట తెలుసా?

praveen
ఇటీవల కాలంలో సినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఎంతో కామన్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు మూవీస్ లో ముద్దు సన్నివేశాలు కనిపిస్తే బూతు అనుకునేవారు ప్రేక్షకులు. కానీ ఇటీవల కాలంలో మాత్రం సినిమాల్లో ఇలాంటి లిప్ లాక్ సన్నివేశాలు లేకపోతే ఇదేం సినిమా రా బాబు అని తిట్టుకుంటున్నారు. అయితే కొంతమంది దర్శకులు కథకు అవసరమని ఇలాంటి సీన్స్ పెడుతుంటే ఇంకొంతమంది దర్శకులు మసాలా యాడ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు అవసరం లేకపోయినప్పటికీ ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలను సినిమాల్లో ఇరికిస్తున్నారు.

 అయితే కేవలం ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలతోనే సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో ప్రేక్షకులు కూడా రొమాంటిక్ సన్నివేశాలు ఇంటిమేట్ సీన్స్ ని కూడా లైట్ తీసుకుని సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఇలా మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి అంటూ ఒక చర్చ తెర మీదకి రావడానికి యానిమల్ మూవీ కారణమైంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 ఇక ఈ సినిమాలో ఇంటిమేట్ సన్నివేశాలతో పాటు ఎంతో హింసాత్మక సన్నివేశాల్లో కూడా నటించి రణబీర్ కపూర్ తన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఇలాంటి సన్నివేశాల్లో నటించినప్పుడు తాను ఎంతగానో భయపడిపోయాను అంటూ రణబీర్ కపూర్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ సన్నివేశాల్లో భయపడకుండా నటించేందుకు తన భార్య ఆలియా భట్ ఎంతగానో ఎంకరేజ్ చేసింది అంటూ తెలిపాడు. ఆమె ప్రోత్సాహంతోనే ఇంటిమేట్ సన్నివేశాలలో నటించగలిగాను అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రణబీర్ కపూర్ ఒక నటుడిగా నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయి. వాటిని దాటాలని ఎప్పుడూ అనుకోలేదు. అయితే డైరెక్టర్ ముందుగానే ఇంటిమేట్ సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. నేను చాలా భయపడ్డాను. కానీ నా భార్య బాగా సపోర్ట్ చేసింది. కేవలం అది పాత్ర మాత్రమే అంటూ ధైర్యం చెప్పింది. ఆమె ఇచ్చిన ధైర్యంతోనే అలాంటి సన్నివేశాలలో నటించా అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: