బాలీవుడ్ హీరోతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించని డైరెక్టర్....!!
ఇక ఇలాంటి క్రమంలో బాలీవుడ్ హీరోలను పెట్టుకుంటే చిరంజీవితో సినిమా చేయలేడు కాబట్టి బాలీవుడ్ హీరోలను దూరం పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే బాలీవుడ్ హీరోలు మాత్రం తెలుగు డైరెక్టర్లు ఎవరు దొరికినా వాళ్లతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే డైరెక్టర్ల కథలను వినడానికి వాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.ఇక అందులో భాగం గానే పూరి దగ్గర ఏదైనా కథ ఉంటే చెప్పండి అని షాహిద్ కపూర్ నుంచి పూరికి కాల్ వెళ్లినట్టుగా తెలుస్తోంది.కానీ పూరి మాత్రం ప్రస్తుతానికి తన దగ్గర షాహిద్ కపూర్ ఇమేజ్ కి సరిపడా కథలు లేవని చెప్పడంతో షాహిద్ కపూర్ కొద్దివరకు నిరాశ చెందినట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే షాహిద్ కపూర్ సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో కబీర్ సింగ్ అనే సినిమా చేసి సక్సెస్ సాధించాడు. ఆయనకు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత అలాంటి భారీ హిట్ ఇంకొకటి పడలేదు. కాబట్టి మళ్ళీ తెలుగు డైరెక్టర్ తో చేస్తేనే భారీ హిట్ దక్కుతుందని భావిస్తున్నాడు. మరి ఆయనతో సినిమా తీసి సక్సెస్ చేసే తెలుగు డైరెక్టర్ ఎవరో తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.