టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు
సితార ఘట్టమనేని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చాలా చిన్న వయసులోనే భారీగా తండ్రికి తగ్గ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ చిన్నారి. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సెలబ్రిటీ పిల్లల్లో సీతారా ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు ఈ పాపకు సోషల్ మీడియాలో అభిమానులతో పాటు చాలామంది
హీరోయిన్స్ సైతం ఫాలో అవుతున్నారు. దాంతోపాటు మామూలుగానే సెలబ్రిటీ పిల్లలు అంటే చాలా స్టైలిష్ గా ఉంటారు. కానీ సీతారా మాత్రం సాధారణ పిల్లల లాగా చాలా సింపుల్ గా ఉంటుంది.
అంతేకాదు ఎటువంటి పండగ ఉన్న కూడా చక్కగా లంగా ఓని వంటి ట్రెడిషనల్ బట్టలను ధరిస్తూ కనిపిస్తుంది. చిన్న వయసులోనే తన మంచి మనసుతో ఎంతోమందికి సహాయం చేస్తూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. మొన్నటికి మొన్న ఒక జ్యువెలరీ యాడ్స్ లో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ యాడ్ కాను
సితార దాదాపుగా కోటి రూపాయల వరకు పారితోషికాన్ని అందుకుంది. ఇకపోతే ఇటీవల కాలంలో సితారకు సంబంధించిన ఏదో ఒక విషయం తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. మరి ముఖ్యంగా
సితార తరచూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.
సితార యూట్యూబ్ ఛానల్ ద్వారా తన డాన్స్ వీడియోలతో పాటు తనకు సంబంధించిన అన్ని వీడియోలను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇక కేవలం
యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే కాకుండా
ఇంస్టాగ్రామ్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక
యూట్యూబ్ లో,
ఇంస్టాగ్రామ్ లో
సితార ను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగానే ఉందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా
సితార తన
ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ప్రమోషనల్ వీడియోలు కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే
సితార నెల సంపాదన గురించి ఒక వార్త వైరల్ గా మారింది.
సితార ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు సుమారుగా 30 లక్షల వరకు సంపాదిస్తోందట..!!