అణచివేస్తారు.. బాలీవుడ్ నెపోటిజంపై.. సందీప్ వంగ షాకింగ్ కామెంట్స్?

praveen
సాధారణంగా చిత్ర పరిశ్రమలో నెపోటిజం ఉంటుంది అని ఎంతో మంది చెబుతూ ఉంటారు. ఏకంగా ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న వారు కేవలం వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వారిని లేదంటే వారి వారసులు మాత్రమే ఇండస్ట్రీలో ఎదగాలని కోరుకుంటారని.. ఇక ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేని వారు ఎవరైనా తెర మీదకి వస్తే వాళ్లని తొక్కేయడానికి ప్రయత్నిస్తారు అంటూ ఇక ఎన్నో రోజులుగా ఇండస్ట్రీలో ఓ మాట వినిపిస్తూనే ఉంది. అయితే టాలీవుడ్ లో మాత్రం ఇలాంటి నెపోటిజంకు తావులేదు అంటూ ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు నిరూపించారు.

 ఎందుకంటే స్టార్ హీరోలు సైతం ఏకంగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి పరిచయం అయిన వారిని ప్రోత్సహిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే అటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో మాత్రం ఇలాంటి నెపోటిజం రోజురోజుకు మరింత పెరిగిపోతుంది అని ఏకంగా అక్కడున్న సెలబ్రిటీలో చెబుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఏకంగా స్టార్ కిడ్స్ మాత్రమే ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగాలని బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారిని ఎదగనివ్వరు అంటూ ఎంతో మంది ఇప్పటికే బహిరంగంగా ఆరోపణలు చేయడం కూడా సంచలనంగా మారిపోయింది. అయితే ఇటీవలే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు సందీప్ రెడ్డి వంగ.

 ఈ క్రమంలోని ఇటీవలే బాలీవుడ్ లో ఉన్న నెపోటిజం గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు అని చెప్పాలి. బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న వాళ్ళు సొంత వారినే ప్రమోట్ చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అంటూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఆరోపణలు చేశాడు. ఒకవేళ వాళ్లను వ్యతిరేకిస్తే అణిచివేస్తారు. అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తారు అంటూ సంచలన విమర్శలు చేశాడు. కబీర్ సింగ్ సినిమా సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. అయితే ఇప్పుడు నా అనుభవాలను చెప్పి చిన్నపిల్లడిలా ఏడవాలని అనుకోవట్లేదు అంటూ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు సందీప్ రెడ్డి వంగ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: