వాచ్ తెచ్చిన తంటా.. ఎయిర్ పోర్టులో స్టార్ హీరోని అదుపులోకి తీసుకున్న పోలీసులు?

praveen
సాధారణంగా విమాన ప్రయాణాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా రూల్స్ కు అనుగుణంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు సంబంధించిన విలువైన వస్తువులను వేటిని కూడా ఇక మరో దేశం లోకి తీసుకువెళ్లేందుకు అవకాశం లేదు. ఒకవేళ తీసుకువెళ్లాలి అంటే ముందుగానే  అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఇలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఒక స్టార్ హీరోకి ఊహించని చేదు అనుభవం ఎదురయింది. హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నల్డ్ స్పార్జ్ నెగరుకు మ్యూనిచ్ ఎయిర్పోర్టులో ఊహించని ఘటన ఎదురైంది.

 నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఏకంగా ఈ స్టార్ హీరోని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. జర్మనీ పర్యటనకు వచ్చిన ఆయనను ఏర్పాటు అధికారులు అడ్డుకున్నారు. అయితే ఆయనను అదుపులోకి తీసుకోవడానికి ఒక వాచ్ కారణమని చెప్పాలి. ఆర్నాల్డ్  జనవరి 17న యూఎస్ నుంచి జర్మనీకి వెళ్లారు. ఆయన చేతికి స్విస్ లగ్జరీ ఆడే మార్స్ పీకేట్ వాచ్ ను ధరించారు. అయితే జర్మనీ అధికారులకు ఈ వాచ్ గురించి ఎలాంటి సమాచారం అందించలేదు. దీంతో విమానాశ్రయంలో అధికారులు ఆయన్ని అడ్డుకున్నారు.

 ఆస్ట్రియాలో జరిగే వరల్డ్ క్లైమేట్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన డిన్నర్ కోసం తన వాచీని వేలం వేసేందుకు నిర్ణయించుకున్నాడు ఆర్నాల్డ్. కానీ ఈ విషయంపై అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఇది వివాదానికి కారణమైంది. యూరోపియన్ యూనియన్ పరిధిలో తయారు కాని ప్రోడక్ట్ ను అనుమతించకూడదని అని నిబంధన ఉంది. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక ఇలా చేసినందుకుగాను టాక్స్ చెల్లించాలని అధికారులను తెలిపారు. అయితే థాంక్స్ చెల్లించడానికి ఆర్నాల్డ్   సిద్ధపడగా.. తన క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించడానికి మిషన్ పనిచేయలేదు. దీంతో గంటసేపు వెయిట్ చేశారు. తర్వాత ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బు విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించిన బ్యాంకు క్లోజ్ అయ్యింది. దీంతో మరో ఎటిఎం మెషిన్ తీసుకువచ్చి ఇక క్రెడిట్ కార్డు ద్వారా టాక్స్ చెల్లించారు. దీనికి మూడు గంటల సమయం వృధా అవ్వగా.. ఆర్నాల్డ్  ఈ చేదు అనుభవం పై  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: