పుష్ప-2 గూర్చి అప్డేట్ ఇచ్చిన రష్మిక మందన్న....!!

murali krishna
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకే కాదు బాలీవుడ్ లో కూడా మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ ఎవరైనా ఉంటే ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్న పేరు రష్మిక మందన్న అనే చెప్తారు. అయితే యానిమల్ మూవీ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అనే చెప్పాలి..డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం పుష్ప 2. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప 2 సినిమా ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ గురించి అందరిలోనూ ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి.ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నటువంటి కేశవ అరెస్టు కావడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా లేదా అన్న సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. ఈ తరుణంలోనే పుష్ప 2 సినిమా విడుదల గురించి తాజాగా రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ… పుష్ప 2 సినిమా విషయంలో నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను ఇది చాలా పెద్ద సినిమా ఎంటర్టైన్మెంట్ విషయంలో మీకు ఎలాంటి ఢోకా ఉండదని ఈమె తెలియజేశారు.ఇటీవలే ఈ సినిమాలో నేను ఒక పాట కూడా కంప్లీట్ చేశానని పాట చాలా అద్భుతంగా వచ్చిందని రష్మిక తెలిపారు. ఇది ముగింపు లేని కథ ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందాన్ని పంచుతుందని, మంచి సినిమాను అందించేందుకు డైరెక్టర్ సుకుమార్ సార్ ఎంతగానో కష్టపడుతున్నారు.పుష్ప2లో నాపాత్ర మరింత ఆకట్టుకునేలా ఉంటుందని ఈ సందర్భంగా పుష్ప సీక్వెల్ సినిమా గురించి రష్మిక చేసినటువంటి ఈ కామెంట్స్ అభిమానులలో మరింత అంచనాలను పెంచుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: