హీరో వెంకటేష్.. సొంతబలాన్నే మర్చిపోయాడా?

praveen
గత కొంతకాలం టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కేవలం మల్టీస్టారర్ సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. యువ హీరోలతో కలిసి నటిస్తూ సూపర్ హిట్లు కొడుతూ ఉన్నారు. అయితే ఇక వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా ఇండివిజువల్ మూవీ అయినప్పటికీ ఇది ఓటీటిలో రిలీజ్ అయింది. దీంతో థియేటర్లో వెంకటేష్ సినిమాను చూడటం మిస్ అయిపోయారు ప్రేక్షకులు. అయితే చాలా రోజుల తర్వాత వెంకటేష్ సైంధవ్ అనే ఇండివిజువల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 ఈ సినిమాకి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. కానీ ఎందుకో సైంధవ్ మూవీకి కలెక్షన్స్ విషయంలో మాత్రం నిరాశ ఎదురవుతుంది అని చెప్పాలి. అయితే ఈ మూవీ రిజల్ట్ చూసిన తర్వాత వెంకీ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక విషయంపై కామెంట్లు చేస్తున్నారు. వెంకీ తన బలం ఏంటో మరిచిపోయాడు అంటూ కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. ప్రతి హీరోకి ఒక బలం ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఇక సినిమా స్టోరీలను ఎంచుకుంటూ ముందుకు సాగాలి  అయితే వెంకటేష్ కు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు వల్లే దృశ్యం, ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి.

 ఫ్యామిలీ కథలను ఎంచుకుంటే వెంకటేష్ మూవీస్ మినిమం గ్యారెంటీ కలెక్షన్లు ఖాయం అని చెప్పాలి. అయితే ఇటీవలే వచ్చిన సైంధవ్ మూవీ అలాంటి కథ కాకపోవడం.. వెంకీకి కాస్త మైనస్ గా మారిపోయింది. ఇక వెంకి కెరియర్ లో 75వ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సైంధవ్ మాత్రం ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. మరోవైపు హిట్, హిట్ 2 సినిమాలతో సక్సెస్ అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను సైంధవ్ కోసం బలమైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఫైల్ అయ్యారు అన్నది సినిమా చూసిన ప్రేక్షకులు భావన. ఈ క్రమంలోనే ఇకనుండి అయిన వెంకటేష్ తన బలాన్ని గుర్తించి ఇక ఎంచుకునే కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: