'జై హనుమాన్' లో.. రాముడి పాత్రలో రామ్ చరణ్?

praveen
ఇటీవల సంక్రాంతికి విడుదలై సౌత్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తున్న మూవీ ఏది అంటే అది హనుమాన్ అని చెప్పాలి. చిన్న మూవీ గా విడుదలైన ఈ సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కింది. అయితే మార్వెల్స్ తరహా లోనే ఒక సూపర్ హీరో యూనివర్సిటీని ప్రారంభించిన ప్రశాంత్ వర్మ ఇక హనుమాన్ అనే మూవీతో ఆ ప్రయోగాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చాడు.

 హిందూ పురాణాల ప్రకారం అందరికీ తెలిసిన సూపర్ హీరో అయిన హనుమంతుడు శక్తి ఒక సామాన్యుడికి వస్తే ఎంతవరకు మంచి చేయవచ్చు అన్న విషయాన్ని ఇక ప్రశాంత్ వర్మ చేసి చూపించాడు. అతి తక్కువ బడ్జెట్ తోనే అదిరిపోయే ఎఫెక్ట్స్ సృష్టించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక ఈ మూవీలోని కాన్సెప్ట్ అందరిని ఫిదా చేసేస్తుంది అని చెప్పాలి. అయితే ఈ సినిమా హిట్ కావడంతో ఇక ఈ సినిమాకు సీక్వెల్ తీసేందుకు కూడా రెడీ అయ్యాడు డైరెక్టర్. ఈ మూవీకి జై హనుమాన్ అనే టైటిల్ ను ఉంటుందని ఇప్పటికే రివీల్ చేశాడు.

 ఇక ఈ మూవీలో హీరో తేజ హీరో కాదని సినిమా మొత్తం హనుమంతుడి పాత్ర చుట్టే తిరుగుతుందని.. ప్రశాంత్ వర్మ తెలిపాడు. అయితే క్లైమాక్స్ లో శ్రీరాముడికి హనుమంతుడు ఒక ప్రమాణం చేస్తాడు. ఆ ప్రమాణం గురించి సినిమా మొత్తం ఉంటుందట. అయితే హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తారో తెలియదు కానీ.. ఇక శ్రీరాముడి పాత్ర మాత్రం రామ్చరణ్ చేయబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ పాత్ర గురించి ప్రశాంత్ వర్మ చరణ్ ను సంప్రదిస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. ఇక నేటితరం హీరోలలో రాముడి పాత్రకు సరిగా సరిపోయేది చరణ్, ప్రభాస్ మాత్రమే అని ప్రశాంత్ వర్మ  అనుకున్నాడట. ప్రభాస్ ఇప్పటికే అలాంటి పాత్ర చేశాడు కాబట్టి చరణ్ ను తన సినిమాలోకి తీసుకోవాలని అనుకున్నాడట ప్రశాంత్ వర్మ. ఇక ఇలా రాముడి పాత్రలో చరణ్ ఎంతల ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: