హనుమాన్ బ్లాక్ బస్టర్.. అయినా ఏ స్టార్ స్పందించడే?

praveen
సాధారణంగా సంక్రాంతి వచ్చింది అంటే చాలు అటు బాక్స్ ఆఫీస్ వద్ద ఉండే సందడి అంతా ఇంతా కాదు. స్టార్ హీరోలు అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగను ఎంతో సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేశామంటే సూపర్ హిట్ కొట్టడం ఖాయమని నమ్ముతూ ఉంటారు. అయితే ఎప్పటిలాగానే ఈ సంక్రాంతికి కూడా ఎంతోమంది పెద్ద హీరోలు తమ సినిమాలను విడుదల చేశారు. ఇలాంటి సమయంలో ఎక్కడ వెనక్కి తగ్గకుండా చిన్న హీరో తేజ సజ్జ సైతం హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి తన మూవీతో ప్రేక్షకులు అందరిని కూడా మెప్పించగలిగాడు. అతి తక్కువ బడ్జెట్ తోనే ప్రశాంత్ వర్మ విఎఫ్ఏఫ్స్ చూపించిన విధానం తో ప్రేక్షకులందరూ కూడా ఫిదా అయిపోయారు అని చెప్పాలి. ఇక ఈ మూవీ ఇప్పటికే మెజారిటీ ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ దాటేసింది. థియేటర్లు పెంచితే ఏకంగా స్టార్ హీరోల సినిమాలతో సమానంగా వసూళ్లు వచ్చే అవకాశం ఉంది అన్నది కూడా తెలుస్తుంది. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో నిర్మాత నిరంజన్ రెడ్డి భారీ గాని లాభాలు సొంతం చేసుకున్నారు.

 అయితే సంక్రాంతి సెలవులు ఉండడంతో ఇక హనుమాన్ ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా ఈ మూవీ ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించిన.. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరు కూడా ఈ మూవీ గురించి స్పందించకపోవడం గమనార్హం. సాధారణంగా ఎవరైనా చిన్న హీరో హిట్టు కొడితే ఎంతో మంది హీరోలు అభినందిస్తూ ఉంటారు. కానీ తేజ సజ్జ సినిమాకి ఇప్పటివరకు ఒక్క స్టార్ హీరో కూడా స్పందించలేదు. ఇది మంచి పద్ధతి కాదు అంటున్నారు సినీ విశ్లేషకులు. చిన్న సినిమాలు సక్సెస్ సాధించడం అరుదుగా జరుగుతుంది. అలా సక్సెస్ సాధించిన సినిమాలకు స్టార్స్ ప్రశంసలు లభిస్తే ఆ సినిమాలో కలెక్షన్స్ మరింత పుంజుకుంటాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: