ఇలాంటి సినిమాలే కావాలని.. ఫ్యాన్స్ అంటున్నారు : నాగార్జున

praveen
టాలీవుడ్ లో సీనియర్ హీరోగా కొనసాగుతున్నాడు అక్కినేని నాగార్జున. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. టాలీవుడ్ ప్రేక్షకులు అందరికీ కూడా నవ మన్మధుడిగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 60 ఏళ్ల వయస్సు దాటిపోతున్న ఇంకా అమ్మాయిల మనస్సు కొలగొట్టే మన్మధుడిగా హవా నడిపిస్తూ ఉన్నాడు నాగార్జున.

 ఇక తన ఫిట్నెస్ తో అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే నాగార్జున ఇటీవల కాలంలో అటు బుల్లితెరపై బిగ్ బాస్ లాంటి షోస్ చేయడంతో పాటు ఇక మరోవైపు వరుసగా సినిమాలతో కూడా బిజీబిజీగా ఉన్నాడు. అయితే గత కొంతకాలం నుంచి ఈ అక్కినేని హీరోకి ఎందుకో సరైన హిట్టు మాత్రం దక్కడం లేదు. ఎన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమాలు పెద్దగా హిట్ అవడం లేదు అని చెప్పాలి. అయితే అక్కినేని ఫ్యామిలీకి సంక్రాంతి సీజన్ మాత్రం బాగా కలిసి వస్తూ ఉంటుంది.

 గతంలో బంగార్రాజు అనే సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు వచ్చి హిట్టు కొట్టిన నాగార్జున ఇక ఇటీవల నా సామిరంగా అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇక ఈ మూవీపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పాలి. కాగా ఈ మూవీకి వస్తున్న స్పందన పై నాగార్జున స్పందించారు. ఇలాంటి చిత్రాలే చేయాలని అభిమానులు అందరూ కూడా తనకు మెసేజ్లు పెడుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన థాంక్యూ మీట్ నిర్వహించగా.. ఇందులో నాగార్జున మాట్లాడారు. కొందరు ఫ్యాన్స్ లేఖలు రాసి ఇంట్లోకి విసిరేస్తున్నారు. ఈ రెస్పాన్స్ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్రతి ఒక్కరం కష్టపడి పని చేసాం అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: