అలా చేసి నటిగా మారిన అల్లు స్నేహారెడ్డి...!!
అల్లు స్నేహారెడ్డి గ్లామర్‌ని, ఫిజిక్, స్టయిలీష్ లుక్‌ని చూసి హీరోయిన్లని మించిపోయిందని, హీరోయిన్గా ఎంట్రీ ఇస్తూ చాలా మంది భామలు అడ్రస్సులు గల్లంతే అన్నారు. కానీ ఇప్పుడు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. ట్విస్ట్, షాక్‌లతో ఆశ్చర్యపరిచింది. అల్లు స్నేహారెడ్డి ఎట్టకేలకు టీవీల్లో మెరిసింది. నటిగానే మారింది. అయితే ఆమె టీవీ యాడ్ చేయడం విశేషం.ఇటీవలే అల్లు స్నేహారెడ్డి చేసిన యాడ్ రిలీజ్ అయ్యింది. ఇందులో ఆమె ఓ చిన్న కుర్రాడితో కలిసి ఛాక్లెట్ యాడ్ చేసింది. కిండర్ షాక్ బార్న్ క్రిస్పీ ఛాక్లెట్ యాడ్ చేసింది. ఇందులో ఆమె హీరోయిన్ రేంజ్లో మెరిసింది. లుక్ వైజ్‌గా ఎంతో అందంగా ఉంది. క్యూట్‌గా, హట్‌గా మెప్పించింది. ఈ యాడ్ సైతం పాపులర్‌గా మారింది.
మొత్తానికి అల్లు స్నేహారెడ్డి గ్లామర్ ఫోటో షూట్ వెనకాల ఇంత పెద్ద స్కెచ్ ఉందా అని ముక్కున వేలేసుకుంటున్నారు నెటిజన్లు. అప్పుడు ఏదో అని విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు వాళ్లు నోరెళ్లబెడుతున్నారు. ఇప్పటికే బన్నీ హీరోగా భారీ పారితోషికం తీసుకుంటున్నారు. మరోవైపు యాడ్స్ చేస్తున్నారు. చిన్నా చితకా వ్యాపారాలున్నాయి. స్టూడియోస్ ఉన్నాయి. ఇలా చేతినిండా సంపాదిస్తున్నాడు. ఇప్పుడు ఆయన భార్య కూడా ఈ రంగంలోకి దిగడం విశేషం.యాడ్ అయినప్పటికీ ఓ రకంగా నటనలోకి దిగింది అల్లు స్నేహారెడ్డి. మరి అదే పనిలో భాగంగా హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇస్తుందా? లేక నటిగా మారుతుందా ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇక మెగా ఫ్యామిలీ ఈ సంక్రాంతిని బెంగుళూరులో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సంక్రాంతిని చాలా స్పెషల్‌గా మార్చుకుంటున్నారు