ఓటీటీ లోకి వచ్చేసిన కళ్యాణ్ రామ్ 'డెవిల్'...!!

frame ఓటీటీ లోకి వచ్చేసిన కళ్యాణ్ రామ్ 'డెవిల్'...!!

murali krishna
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్. ఇటీవల బింబిసార సినిమా తో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తరువాత అమిగోస్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయి లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
అమిగోస్ మూవీ ఫ్లాప్ కావడం తో కళ్యాణ్ రామ్ తరువాత మూవీ అయిన డెవిల్ పై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. డెవిల్ మూవీ గత ఏడాది డిసెంబర్ 29 న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా లో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ ఏజెంట్ గా కనిపించారు. డెవిల్ లో కళ్యాణ్ రామ్ కు జోడీగా సంయుక్తమీనన్ నటించింది. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లో అలరించడానికి రెడీ అయ్యింది. డెవిల్ అతీతే రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేటుకు డెవిల్ ఓటీటీ డీల్ సెట్ అయ్యిందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ సిద్ధమైంది.డెవిల్ మూవీ ను సంక్రాంతి కానుక గా జనవరి 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా సడన్ గా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ను అనౌన్స్ చేశారు. ఈ సంక్రాంతి కి థియేటర్స్ లో కొత్త సినిమాల సందడి మొదలైంది.మహేష్ బాబు గుంటూరు కారం, తేజ హనుమాన్ మరియు వెంకటేష్ సైందవ్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. అలాగే నాగార్జున ‘నా సామిరంగ’ రేపు రిలీజ్ కానుంది..దీనితో ఓటీటీ ప్రేక్షకులకు కూడా డెవిల్ మూవీ తో మేకర్స్ సంక్రాంతి ట్రీట్ ఇవ్వనున్నారు.అయితే థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోని డెవిల్ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అయినా మెప్పిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: