సంక్రాంతికి అరవ చిత్రాల వసూళ్లు చాలా దారుణం?

Purushottham Vinay
ఈ సంక్రాంతి పండక్కి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ధనుష్ 'కెప్టెన్ మిల్లర్', శివ కార్తికేయన్ 'అయలాన్' సినిమాలు పోటీ పడిన సంగతి తెలిసిందే.ఇక ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే. అలాగే రెండింటికి భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ధనుష్, శివ కార్తికేయన్ వీరు ఇద్దరికీ కోలీవుడ్లో ఈక్వల్ మార్కెట్ తో పాటూ అదే రేంజ్ లో స్టార్ డమ్ ఉంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు హీరోల్లో ఈ సంక్రాంతికి ఎవరు విజేతగా నిలుస్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది.ఇక తమిళనాట 'కెప్టెన్ మిల్లర్' సినిమా రూ.6.5 కోట్ల ఓపెనింగ్స్ అందుకుంటే శివ కార్తికేయన్ 'అయలాన్' సినిమా మాత్రం మొదటి రోజు మాత్రం రూ.3.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే కెప్టెన్ మిల్లర్ కి సినిమాకి రూ.13 కోట్ల రేంజ్ లో గ్రాస్ 'అయలాన్' కి దాదాపు రూ.6.7 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చింది. అంటే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 'కెప్టెన్ మిల్లర్' సినిమా 'అయలాన్' సినిమా కంటే రెట్టింపు ఓపెనింగ్స్ నమోదు చేసింది.నిజానికి రిలీజ్ కాక ముందు ఈ రెండు సినిమాలకు పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు.అందువల్ల కలెక్షన్స్ పై ప్రభావం పడింది.



ఇక ఈ ఇద్దరు కోలీవుడ్ హీరోల మార్కెట్ ని బట్టి చూస్తే రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ ని అందుకోవడంలో దారుణంగా విఫలమయ్యాయనే చెప్పాలి. ఇక శివ కార్తికేయన్ 'అయలాన్' సినిమా కోలీవుడ్ లో ఈరోజు మంచి ఆక్యుపెన్సీ ని కలిగి ఉంది.అలాగే ధనుష్ కెప్టెన్ మిల్లర్ ఆక్యుపెన్సీ కూడా దాదాపు ఒకే విధంగా ఉంది.ఇక ప్రస్తుతం ఈ సినిమాల బుకింగ్స్ ని బట్టి రేపటి నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా వేటికవే డిఫరెంట్ జోనర్స్ లో రూపొందినవే. ఇందులో ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామా అయితే శివ కార్తికేయన్ 'అయలాన్' సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీ. ఈ రెండు సినిమాల్లో కూడా రెండు బలమైన మెసేజ్లు ఉన్నాయి. మన తెలుగు సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం టాక్ తో సంబంధం లేకుండా 127 కోట్ల పైగా వసూళ్లు రాబట్టగా హనుమాన్ బ్లాక్ బస్టర్ టాక్ తో 30 కోట్ల రేంజ్ లో వసూలు చేసింది.ఒక పక్క మన తెలుగు సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా సాలిడ్ వసూళ్లు నమోదు చేస్తుంటే అరవ సినిమాలు మాత్రం వసూళ్లు రాబట్టలేక అల్లాడిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: