గుంటూరు కారం: అమెరికాలో మహేష్ సూపర్ రికార్డ్?

Purushottham Vinay
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా నేడు జనవరి 12న థియేటర్స్ లోకి వచ్చి బాగా సందడి చేస్తుంది.ఈ సినిమా మొదటి ఆట నుంచే ఫ్యాన్స్ స్టఫ్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకొని దూసుకెళ్తుంది. పండక్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారంటున్నారు సూపర్ స్టార్ అభిమానులు. అమ్మ సెంటిమెంట్ తో మాస్ కమర్షియల్ అంశాలు జోడించి సినిమా అదరగొట్టారు. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా రమ్యకృష్ణ, జయరాం, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, మురళి శర్మ, ఈశ్వరరావు.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు.ఇక ఈ సినిమా కలెక్షన్స్ లో కూడా రికార్డ్స్ సెట్ చేయబోతుంది. అర్ధరాత్రి నుంచే ప్రీమియర్స్ వేయడం, థియేటర్స్ లో అభిమానులు సందడి చేస్తుండటంతో మొదటి రోజు గుంటూరు కారం కలెక్షన్స్ చాలా భారీగా వస్తాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే మహేష్ ఆల్రెడీ అమెరికాలో కలెక్షన్స్ తో మరో సరికొత్త రికార్డ్ ని సెట్ చేశాడు.మన ఇండియన్ సినిమాలకు అందులోను ముఖ్యంగా తెలుగు సినిమాలకు అమెరికాలో చాలా మంచి మార్కెట్ అనేది ఉంది. అమెరికాలో కూడా మన సినిమాలు చాలా గ్రాండ్ గా రిలీజయి మంచి కలెక్షన్స్ సాధిస్తాయి. మన హీరోలు అక్కడ కూడా ఎన్నో రికార్డులు సెట్ చేస్తారు. ఇక అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ అంటే మన రూపాయల్లో దాదాపు 8 కోట్లు కలెక్ట్ చేస్తే మంచి కలెక్షన్స్ వచ్చినట్టే.


మన హీరోలంతా అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి రికార్డులు సెట్ చేయాలని చాలా ఆశపడతారు.అయితే ఈ రికార్డుని ఇప్పటిదాకా  అందరికంటే ఎక్కువ సార్లు మన సూపర్ స్టార్ మహేష్ బాబు సాధించాడు. మహేష్ బాబు ఇప్పటికే 11 సినిమాలతో వరుసగా 1 మిలియన్ డాలర్స్, అంతకు పైగా కలెక్ట్ చేసి టాప్ లో ఉండగా తాజాగా గుంటూరు కారం సినిమాతో  కూడా 12వ సారి ఆ రికార్డ్ ని సాధించాడు. గుంటూరు కారం సినిమాతో అమెరికాలో ప్రీమియర్స్, మొదటి రోజు హాఫ్ డే లోపే ఏకంగా 1.4 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించి మహేష్ మరోసారి తన సత్తా చాటాడు. ఇంకా వసూళ్లు పెరుగుతున్నాయి.దీంతో వరుసగా 12వ సారి 1 మిలియన్ డాలర్స్ పైగా కొల్లగొట్టి మహేష్ అమెరికాకు గుంటూరు కారం ఘాటు ఏంటో చూపించి ఓవర్సీస్ కింగ్ అయ్యాడు.ఈ రికార్డులో మహేష్ 12 సినిమాలతో మొదటి ప్లేస్ లో ఉండగా మహేష్ తరువాత నాని 9 సినిమాలతో రెండో ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, చిరంజీవి, రామ్ చరణ్ వరుస స్థానాల్లో ఉన్నారు. దీంతో సూపర్ స్టార్ మహేష్ అభిమానులు మరో సరికొత్త రికార్డ్ ఏకంగా అమెరికాలో సెట్ చేసాం అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: