బుల్లితెర టాప్ షో
జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు సుడిగాలి సుదీర్. ఆ క్రేజ్ తోనే ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ హీరోగా బిజీ అయ్యాడు. దానితోపాటు
జబర్దస్త్ షో ద్వారా ఇప్పటికే చాలామంది కమెడియన్స్ దర్శకులుగా హీరోలుగా మారారు. ఇక సుదీర్ యాంకర్ రష్మితో కలిసి స్టేజ్ పై కెమిస్ట్రీ పలికిస్తు బుల్లితెరపై సూపర్ జోడిగా బాగా పాపులర్ అయ్యారు. రియల్ లైఫ్ లో కూడా వీళ్ళిద్దరూ కలవాలని ఫ్యాన్స్ కోరుకునేలా ఈ ఇద్దరు కలిసి ఫ్యాన్ బేస్ ఏర్పడేలా ఈ జోడి పాపులర్ కావడం, ప్రేక్షకులలోకి వెళ్లడం విశేషం.
వెండితెరపై వరుస
సినిమా అవకాశాలు రావడంతో
సుడిగాలి సుధీర్ జబర్దస్త్ కి పూర్తిగా గుడ్ బై చెప్పేసారు. ఇప్పటికే హీరోగా
సాఫ్ట్ వేర్ సుధీర్ , గాలోడు సినిమాలతో మెప్పించారు
బుల్లితెర టాప్ షో జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ . ఇటీవల కాలింగ్ సహస్ర అనే క్రైమ్
థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే
సుధీర్ మాత్రం సినిమాల్లో ఓ నియమాన్ని పాటిస్తున్నారు. తన సినిమాలో
హీరోయిన్ తో లిప్ లాక్, రొమాన్స్ సీన్లు ఉండవద్దని ఆయన భావిస్తున్నారు. సినిమాలు చేసే దర్శకులకు కూడా అదే విషయాన్ని ముందుగా చెబుతున్నారు.
ఆమధ్య ఇంటర్వ్యూలో
సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ..తన సినిమాలో లిప్ లాక్ లు, రొమాన్స్ సీన్లు ఉండవని చెప్పారు. వాటికి తాను దూరంగా ఉంటానని వెల్లడించారు. కచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తానని
సుడిగాలి సుధీర్ చెప్పారు. సాధ్యమైనంత వరకు ఇది ఫాలో అవుతానని అన్నారు. అయితే దానికి కారణం ఏంటనేది అందరూ ఆరా తీస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!