వైరల్ గా మారిన విష్ణుప్రియ డాన్స్ ప్రాక్టీస్ వీడియో....!!

murali krishna
బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించారు అయితే ఇటీవల కాలంలో ఏమే బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనప్పటికీ పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.మరోవైపు ప్రవేట్ ఆల్బమ్స్ చేస్తూ కూడా ఈమె కెరియర్ పరంగా బిజీగా ఉన్నారని చెప్పాలి. ఈ విధంగా విష్ణు ప్రియా తన వృత్తి పరమైనటువంటి జీవితంలో బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు.విష్ణు ప్రియ తరచూ జిమ్ లో వర్కౌట్ చేయడం లేదంటే తన స్నేహితురాలు రీతు చౌదరి తో కలిసి వెకేషన్ లోకి వెళ్లడం చేస్తుంటారు. అదేవిధంగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కూడా ఈమె అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇలా తరచూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడంతో విష్ణు ప్రియను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా అధికంగానే ఉందని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఈమె కుర్చీ మడత పెట్టి అనే పాటకు డాన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము అంటూ అందుకు సంబంధించిన స్టెప్స్ వేస్తూ ఉన్నటువంటి వీడియోని ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ కుర్చీ మడత పెట్టి అనే పాట ఎంతలా ట్రెండ్ అవుతుందో మనకు తెలిసిందే. తెలంగాణకు చెందినటువంటి అహమ్మద్ షాషా అనే తాత కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్ ఉపయోగించడంతో ఒక్కసారిగా ఈ డైలాగ్ ఎంతో ఫేమస్ అయ్యింది.  ఇక ఈ డైలాగ్ ఏకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్నటువంటి గుంటూరు కారం సినిమాలో పాటని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా నుంచి ఈ పాటను విడుదల చేయడంతో ఒక్కసారిగా ఈ పాట సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. దీంతో ఎంతోమంది సెలబ్రిటీలో ఈ పాటకు రీల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ పాటకు డాన్స్ చేయడం కోసం తాము కూడా ప్లాన్ చేస్తున్నాము అంటూ విష్ణు ప్రియ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: