"హనుమాన్" మూవీకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ తాజాగా హనుమాన్ అనే సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందిన సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విరి కాంబో లో జాంబి రెడ్డి అనే మూవీ రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో వీరిద్దరి కాంబో లో రూపొందిన రెండవ సినిమా అయినటువంటి హనుమాన్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.


జనాల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా రేపు అనగా జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లు చాలా చోట్ల ప్రదర్శించబడుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రి రిలీజ్ చేసిన జరిగింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి నైజాం ఏరియా లో 7.15 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా , సీడెడ్ ఏరియాలో 4 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 9.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇకపోతే మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 20.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపు కొని రెండు కోట్ల రిలీజ్ బిజినెస్ జరగగా , ఓవర్ సీస్ లో 4 కోట్ల ప్రియ రిలీజ్ బిసినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 26.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 27.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ లోకి దిగబోతుంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 27.50 కోట్ల షేర్ కలక్షన్ రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: