పుష్ప -2 రిలీజ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చేసిన సుకుమార్..!!

Divya

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ రష్మిక కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా 2021 లో విడుదల భారీ విజయాన్ని అందుకుంది.. తాజాగా పుష్ప-2 చిత్రానికి సంబంధించి షూటింగ్ ని చిత్ర బృందం వేగవంతంగా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అప్పుడప్పుడు ఈ చిత్రానికి సంబంధించి పలు రకాల లీకైన ఫోటోలు వీడియోలు కూడా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ సినిమా విడుదల తేదీ ఆగస్టు 15న ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చే విధంగా చిత్ర బృందం గతంలోనే అనౌన్స్మెంట్ చేశారు.


అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి పుష్ప-2 సినిమా రిలీజ్ వాయిదా పడుతుందనే విషయం వైరల్ గా మారుతోంది.. ఇందులో కేశవ పాత్రలో నటించిన జగదీష్ పాత్ర ఎక్కువగా ఉందని ఈ మేరకు కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతోందని కానీ సడన్గా ఒక యువతి ఆత్మహత్య కేసులో జగదీష్ ని పోలీసులు అరెస్టు చేయడంతో ఈ సినిమా షూటింగ్ కి బ్రేకులు పడ్డట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంకా ఆ కేసు నుంచి జగదీష్ బయటకి రాలేదని తెలుస్తోంది.

దీంతో పుష్ప-2 సినిమా విడుదల తేదీ వాయిదా పడుతుందంటూ పలు రకాల రూమర్స్ వినిపించాయి. దీంతో అభిమానుల సైతం అటు సుకుమార్ పైన చిత్ర యూనిట్ పైన ఫైర్ అవుతున్నారు. అయితే ఈరోజు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుట్టినరోజు కావడంతో ఒక స్పెషల్ విషెస్ తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పుష్ప-2 సినిమా విడుదల తేదీ పైన మరొక సారి క్లారిటీ ఇచ్చారు.. 2024 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు ఎట్టకేలకు డైరెక్టర్ సుకుమార్ పుష్ప-2 రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడంతో ఇక రూమర్లకు చేక్ పడినట్టే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: