టాలీవుడ్ స్టార్
హీరో సూపర్ స్టార్ బాబు త్రివిక్రమ్
శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం
మూవీ మరో రెండ్రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం
సినిమా షోలు మొదలుకానున్నాయి.తెలంగాణలో గుంటూరు కారం సినిమాకు టికెట్ రేట్ల పెంపుతో పాటు ఆరు షోలకు అనుమతులు రావడం ఆ సినిమాకి ప్లస్ అయింది. ఇక
హైదరాబాద్ లో ఇప్పటికే ఈ సినిమాకు బుకింగ్స్ మొదలయ్యాయి. బుకింగ్స్ మొదలైన కొన్ని గంటల్లోనే ఈ
సినిమా టికెట్స్ రికార్డ్ రేంజ్ లో బుక్ అవుతుండటం గమనార్హం.మల్టీప్లెక్స్ లలో, సింగిల్ స్క్రీన్స్ లో ఈ
మూవీ బుకింగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అయితే తెలంగాణలో టికెట్ రేట్స్ పెరిగినా ఏపీలో మాత్రం గుంటూరు కారంకి షాక్ తగిలింది. ఏపీలో 75 రూపాయలు హైక్ కి
మూవీ టీం అప్లై చేస్తే కేవలం 20/- మాత్రమే టికెట్ రేట్ పెరిగింది. అలాగే చెన్నైలో కూడా ఈ
సినిమా రిలీజ్ కావట్లేదు. ఎందుకంటే
తమిళ డబ్బింగ్ సినిమాలకు తెలుగులో థియేటర్లు కరువు కావడం వాళ్ళ అక్కడ మన తెలుగు సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు.
ఇక ఏడాదిన్నర గ్యాప్ తర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న
సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. యాక్షన్ డ్రామా కథాంశంతో గుంటూరు కారం తెరకెక్కగా ఈ
మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గుంటూరు కారం
మూవీ ఫస్ట్ డే కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గుంటూరు కారం మూవీకి బుకింగ్స్ విషయంలో వస్తున్న రెస్పాన్స్ విషయంలో అభిమానులు సంతోషంగా ఉన్నారు. గుంటూరు కారం ప్రీ రిలీజ్
ఈవెంట్ గ్రాండ్ గా జరగగా మహేష్ బాబు ఇచ్చిన స్పీచ్ నెట్టింట వైరల్ అవుతుంది.అభిమానులకు మహేష్ బాబు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారో ఆ స్పీచ్ ను బట్టి అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గుంటూరు కారం మూవీకి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగగా ఫస్ట్ వీక్ కే కొన్ని ఏరియాలలో ఈ
సినిమా చాలా ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది.