
ఊరికే ఎందుకు ఫారిన్ టూర్లకు వెళ్తారు.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన మహేష్ బాబు?
ఇక మహేష్ అనే పేరు వినిపించింది అంటే లేడీ ఫ్యాన్స్ అందరూ కూడా మెలికలు తిరిగిపోతూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీన గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. ఇక ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు మహేష్ బాబు. అయితే ఇటీవలే కాలంలో మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి తరచూ ఫారిన్ టూర్లకు వెళుతూ ఉన్నాడు. ఇలాంటి సమయంలోనే షూటింగ్లకు కూడా బ్రేక్ పడుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే.
అయితే ఇటీవలే ప్రమోషన్స్ లో భాగంగా ఎక్కువగా ఫారిన్ టూర్లకు ఎందుకు వెళ్తారు అన్న ప్రశ్న మహేష్ బాబుకి ఎదురైంది. ఇక ఈ ప్రశ్నకు తనదైన శైలిలోనే సమాధానం చెప్పాడు మహేష్. అవునండి నాకు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం అంటే ఇష్టం. అందుకే నేను ఎక్కువగా ఫారిన్ టూర్లకి వెళ్తాను. నేను ఇండియాలో అలా రోడ్డు మీద తిరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. నావల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అస్సలు ఉండకూడదు. అందుకే నాకు చిన్న టైం దొరికిన నేను ఫారిన్ వెకేషన్ కి ఎంజాయ్ చేయడానికి వెళ్తాను. నా కుటుంబమే నాకు ఇంపార్టెంట్ అంటూ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు మహేష్ బాబు.