టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున త్వరలోనే నా సామిరంగా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మూవీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14వ తేదీ విడుదల కానుంది.ఈ మూవీకి విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన మొదటిసారి మెగా ఫోన్ పట్టారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పథాకం పై ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఇక ఈ మూవీలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్ రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరోలు కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్స్ సినిమాపై మంచి అంచనాలని పెంచేసాయి.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గరవుతున్నటువంటి క్రమంలో సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఈ మూవీ కోసం నాగార్జున తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది.నా సామిరంగా సినిమా కోసం నాగార్జున 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈయనతో పాటు ఉన్న హీరోలతో పోలిస్తే నాగార్జున తక్కువ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది.గత చిత్రాలకు ఈయన ఆరు నుంచి 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోగా ఈ సినిమాకు మాత్రం 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారని సమాచారం.ఇక ఈ సినిమా టికెట్ రేట్ల విషయంలో ఎలాంటి పెరుగుదల లేదు. నార్మల్ రేట్లకే ఈ సినిమా రిలీజ్ కానుంది. మూవీ టీం టికెట్ రేట్ పెరుగుదల కోసం గవర్నమెంట్ ని సంప్రదించలేదంట. అందుకే ఈ సినిమా నార్మల్ టికెట్ ధరలతోనే రిలీజ్ కానుంది.ఇక నాగార్జున చివరిగా ఘోస్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఈయన నా సామి రంగా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.