మహేష్ సినిమాలో హీరోయిన్గా.. ఆ విదేశీ అమ్మాయిని తీసుకోబోతున్నారా?

praveen
ఒకప్పుడు రాజమౌళి అంటే టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అని మాత్రమే చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు రాజమౌళి రేంజ్ ఎంతలా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ తో తీసిన బాహుబలి సినిమాతో ఇక రాజమౌళి ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక రాజమౌళి లాంటి డైరెక్టర్ సినిమాలో ఒక్క చిన్న పాత్ర వచ్చిన చాలు అని పెద్దపెద్ద స్టార్స్ సైతం ఆశపడే విధంగా హవా నడిపిస్తూ ఉన్నాడు. ఇక రాజమౌళి సినిమా వస్తుందంటే కేవలం భారత క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.

 ఇక ఎవరైనా హీరోతో రాజమౌళి సినిమా చేస్తున్నారంటే ఆ హీరో ఏదో అదృష్టం చేసుకొని ఉంటాడు అని మిగతా హీరోలు కుల్లుకునే విధంగా ప్రస్తుతం ఈ డైరెక్టర్ ప్రస్థానం కొనసాగుతూ ఉంది. అయితే త్రిబుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ హిట్టు కొట్టి ఏకంగా ఆస్కార్ అవార్డును సైతం అందుకున్న రాజమౌళి ఇక ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అడ్వెంచర్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కపోతుంది  అన్నది తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేస్తారో అన్న విషయంపై గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది.

 బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొనేను ఈ మూవీలో హీరోయిన్గా సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు గత కొంతకాలం నుంచి వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఇక ఈ హీరోయిన్ ను కాకుండా మరో కొత్త హీరోయిన్ పేరు తెరమీదకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా మహేష్ బాబు సినిమాలో ఇండోనేషియాకు చెందిన సెల్సియ ఇస్లాన్ ను హీరోయిన్గా తీసుకోబోతున్నట్టు ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే స్క్రీన్ టెస్ట్ కూడా పూర్తయిందట. అయితే ఇది ప్రత్యేకమైన పాత్రనా లేకపోతే పూర్తి హీరోయిన్ పాత్రేనా అనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: