రెండో సినిమాకి స్క్రిప్ట్ రెడీ చేసుకున్న బలగం వేణు.. హీరో ఎవరంటే?

praveen
ఎవరిలో ఎలాంటి టాలెంట్ ఉంది అని చెప్పడం చాలా కష్టం. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అని చెబుతూ ఉంటారు నిపుణులు. అయితే ఇది నిజమే అని నిరూపించాడు జబర్దస్త్ కమెడీయన్  వేణు. ఇక ఒకప్పుడు జబర్దస్త్ లో కమెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బ  నవ్వించిన వేణు తనలో దాగి ఉన్న దర్శకత్వ ప్రతిభను బలగం అనే సినిమాతో నిరూపించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో జబర్దస్త్ వేణు కాస్త బలగం వేణుగా మారిపోయాడు. అయితే ఇక తాను తీసిన బలగం సినిమాతో ఏకంగా థియేటర్లను పట్టణాల నుంచి పల్లెలకు తీసుకు వెళ్ళగలిగాడు వేణు. ఇక ప్రతి పల్లెలో కూడా బలగం సినిమాను ప్రత్యేక ప్రదర్శనలు చేసి పాత రోజులను గుర్తు చేసింది ఈ సినిమా.

 ఫ్యామిలీలో ఉండే అన్ని బంధాల్లోని ఎమోషన్స్ ను చూపించి ప్రతి ప్రేక్షకుడిని కూడా కంటతడి పెట్టించింది అని చెప్పాలి. ఇక ఈ ఒక్క మూవీ తోనే వేణు కి ఊహించని రీతిలో గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఇక ఈ సినిమా 100కు పైగా అంతర్జాతీయ అవార్డులను అందుకుంది అని చెప్పాలి. ఇక ఈ ఒక్క మూవీతో వేణు ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే బలగం మూవీ తర్వాత వేణు తన రెండవ సినిమా ఎవరితో చేయబోతున్నాడు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక మరోసారి దిల్ రాజు బ్యానర్ లోనే వేణు మూవీ చేయబోతున్నాడు.

 ఇక ఇప్పటికే తన రెండో సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసుకున్నాడట బలగం వేణు  ఇక ఈ స్క్రిప్ట్ ను నాచురల్ స్టార్ నానికి వినిపించాడు అన్నది తెలుస్తోంది. అయితే బలగం సినిమా చూసిన నాని వేణు దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని అనుకుంటున్నాడట. ఈ క్రమంలోనే ఇక వేణు వినిపించిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసాడట. నాని హాయ్ నాన్న ఓటీటి స్క్రీనింగ్ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించాడు నాని. దీంతో ఇక బలగం వేణు నాని కాంబోలో ఒక మూవీవచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే బలగం లాంటి క్లాసిక్ ఎమోషనల్ డ్రామా తర్వాత ఇప్పుడు వేణు ఎలాంటి కథను ఎంచుకున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: