రష్మిక హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు అది ఉంటుంది.. బ్యూటీ సీక్రెట్ బయటపెట్టిన విజయశాంతి?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా కొనసాగుతోంది రష్మిక మందన్న. చలో అనే సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఎంతోమంది స్టార్ హీరోల  సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది.  ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా చక్రం తిప్పేందుకు సిద్ధమైంది. అక్కడ కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది అని చెప్పాలి.

 అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్ లో కాస్త అవకాశాలు తగ్గినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం వరుసగా ఛాన్స్ లు దక్కించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ అనే మూవీలో నటించింది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే రష్మిక మందన్న ఇప్పటివరకు తన అందం అభినయంతో కూడా ప్రత్యేకమైన గుర్తింపులు సంపాదించుకుంది.

 అయితే తన గ్లామర్ సీక్రెట్ ఏంటి అన్న విషయాన్ని మాత్రం ఇప్పటివరకు రష్మిక బయట పెట్టలేదు. కానీ ఇటీవల రష్మిక తో పాటు ఒక సినిమాలో కలిసిన సీనియర్ హీరోయిన్ రాజకీయ నాయకురాలు విజయశాంతి మాత్రం రష్మిక బ్యూటీ సీక్రెట్ బయటపెట్టింది. రష్మిక ఎక్కడికి వెళ్లిన ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కచ్చితంగా ఏడు లీటర్ల వాటర్ తాగుతుందట. ఇక చాలామంది అమ్మాయిలు బయటకు వెళ్ళేటప్పుడు.. వారి హ్యాండ్ బ్యాగ్ లో అందానికి సంబంధించిన మేకప్ కిట్ పేట్టుకొని వెళ్తూ ఉంటారు. కానీ రష్మిక మాత్రం తన హ్యాండ్ బ్యాగ్ లో వాటర్ బాటిల్ తీసుకువెళ్తుందట. ఆమె అన్ని నీళ్లు తాగడం వల్ల అంత గ్లామర్ గా ఉంది. అంతేకాదు నీటి కి సంబంధించిన వాటర్ మిలన్, కొబ్బరి నీళ్ళు, పండ్లరసాలు వంటివి తరచూ తింటూనే ఉంటుంది. అందుకే అలా రష్మిక మెరిసిపోతుంది అంటూ నేషనల్ క్రష్ సీక్రెట్ ను బయటపెట్టింది విజయశాంతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: