హనుమాన్ మాస్టర్ స్ట్రాటజీ !
మరొక వైపు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ మరొక వైపు ఈ సినిమా హీరో దర్శకుడుతో ఇంటర్వ్యూలు ఇప్పిస్తూ సినిమా పై అంచనాలు పెంచేస్తున్నారు. సుమారు 20 సంవత్సరాల క్రితం మహేష్ నటించిన మూవీలో అతడి కొడుకు పాత్రలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన తేజ్ సజ్జా ఇప్పుడు అదే మహేష్ తో పోటీ పడుతూ తన సినిమాలను విడుదల చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
ఇప్పుడు ఈ సినిమా విడుదల విషయంలో విపరీతమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తున్న ఈమూవీ యూనిట్ మరొక మాస్టర్ స్ట్రాటజీకి శ్రీకారం చుడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో చాల చిన్న సినిమాలు విడుదల తేదీకి ముందురోజు తమ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు వేసి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘హనుమాన్’ మూవీ కూడ ఇదే స్ట్రాటజీని పాటిస్తోంది.
ఈ సినిమా యూనిట్ అంచనాల ప్రకారం ‘హనుమాన్’ ప్రీమియర్ షోలకు మంచి స్పందన వస్తే ఈ సినిమా విడుదల అయ్యే మొదటిరోజు మొదటి షో నుండి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం వల్ల కలక్షన్స్ బాగా ఉండటమే కాకుండా మహేష్ ‘గుంటూరు కారం’ మ్యానియా నుండి రక్షణ పొందవచ్చు అని ఈ మూవీ యూనిట్ సభ్యుల ఆలోచన అని అంటున్నారు. ఈసినిమా విడుదల అయ్యే డేట్ కు ‘హనుమాన్’ టాక్ తెలిసిపోతే ‘గుంటూరు కారం’ పోటీ నుండి చాల తెలివిగా తప్పించుకోవచ్చు అన్న ఆలోచనలో ‘హనుమాన్’ యూనిట్ ఉన్నట్లు టాక్..