సంక్రాంతి రేస్ లో మరో కోణం !
సాధారణ సీజన్ లో విడుదల అయ్యే సినిమాల కంటే సంక్రాంతి సీజన్ విడుదల అయ్యే సినిమాలకు 30 శాతం వరకు అదనపు కలక్షన్స్ వస్తాయి కాబట్టి హీరోలు అంతా సంక్రాంతి విజేత కావాలని తమ ప్రయత్నాలు శక్తివంచన లేకుండా కొనసాగిస్తూనే ఉంటారు. అయితే ఈసారి సంక్రాంతికి ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 5 సినిమాలు విడుదల అవుతూ ఉండటంతో ఇన్ని సినిమాలకు ధియేటర్లు దొరకడం ఒక సమస్య అయితే ఇన్ని సినిమాలను పెరిగిన టిక్కెట్ల రేట్లతో ప్రేక్షకులు చూస్తారా అన్న సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి.
అయితే ఈ సంక్రాంతి సినిమాల బిజినెస్ లో అందరు పాజిటివ్ యాంగిల్ చూస్తున్నారు కాని నెగిటివ్ యాంగిల్ చూడటం లేదు అని ఇండస్ట్రీలోని కొందరు అభిప్రాయ పడుతున్నారు. గతంలో 2016 లో ఇలాగే సంక్రాంతికి 4 భారీ సినిమాలు వస్తే ఆ సినిమాలలో హిట్ అయిన రెండు సినిమాలను మాత్రమే చూసి మిగతా సినిమాల వైపు ప్రేక్షకులు అడుగులు వేయలేదు.
ఇప్పుడు ఈసారి సంక్రాంతి రేస్ కు మహేష్ వెంకటేష్ రవితేజా నాగార్జున లు నటించిన క్రేజీ సినిమాలు విడుదల అవుతున్నాయి. వీరి మధ్య తేజ్ సజ్జా ‘హనుమాన్’ దేశం అంతా జనవరిలో అయోధ్య రామమందిరం మ్యానియాతో ఉండబోతున్న పరిస్థితులలో ఈ మూవీ పై కూడ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనితో సంక్రాంతి సినిమాల రేస్ లోని మరో కోణాన్ని మన నిర్మాతలు మన హీరోలు మర్చిపోయారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..