స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసిన మణి శర్మ..!!
పవన్ కళ్యాణ్ కు ఖుషి ,గుడుంబా శంకర్ వంటి చిత్రాలకు భారీ మ్యూజిక్ను అందించారు మణిశర్మ.. కానీ ఇద్దరు కూడా ఈ మధ్యకాలంలో మణిశర్మ తో సినిమాలు చేయడానికి పెద్దగా మక్కువ చూపలేదు.. అందుకు కారణం ఏమని ఆయనను అడగగా మహేష్ తో తన చివరి సినిమా వరకు పూర్తి నిశ్శబ్దతతోనే పనిచేశానని అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఎవరు తనకు లేనిపోనివి ఎక్కించారో తెలియదని తెలిపారు మణిశర్మ.
భవిష్యత్తులో మహేష్ తో ఏవైనా సినిమాలు చేస్తారని అడగగా అతడు కనీసం రెండు పెగ్గులు తాగడానికి కూడా తనకు పిలవడం లేదని తెలియజేశారు.. పవన్ కళ్యాణ్ గురించి స్పందిస్తూ ఆయనతో మంచి బాండింగ్ ఉండేది కెరియర్లో చాలా సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్స్ ఇచ్చాను ఖుషి లో కేవలం చెలియా చెలియా అనే పాటకు తాను పవన్ తో కలిసి కూర్చొని మరి ఆ పాటకు కంపోజ్ చేశానని అలాగే గుడుంబా శంకర్ లో మాత్రం అన్ని పాటలకు ఇద్దరం కలిసి చేసినట్లుగా తెలియజేశారు.. ఈ ఇద్దరు స్టార్ హీరోలు అందరికీ అవకాశం ఇవ్వాలని తెలియజేశారు. తనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని తెలియజేశారు మణిశర్మ.. ఈ విషయం తెలిసి చాలామంది బాధపడుతూ అభిమానులు సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.