సిద్ధార్థ్ - అదితి రిలేషన్ పై క్లారిటీ ఇచ్చినట్టేనా..?
అయితే వీరి గురించి ఎన్ని రకాలుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ వార్తల పైన ఎక్కడా కూడా ఒక్కసారి క్లారిటీ కూడా ఇవ్వలేదు. కానీ కెమెరా ముందు మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండడమే కాకుండా విదేశాలకు సైతం వెకేషన్ కు వెళ్తూ పార్టీలకు రెస్టారెంట్లకు కలిసి వెళుతూ ఉండడంతో వీరిద్దరూ రిలేషన్షిప్ గురించి పలు వార్తలు వైరల్ గా మారాయి.. కానీ వీరిద్దరి రిలేషన్ విషయాన్ని మాత్రం బయటికి చెప్పడం లేదంటూ తెలుస్తోంది. దీంతో వీరి రిలేషన్షిప్ పైన చాలామంది నేటిజెన్లకు సందేహాలు వ్యక్తం అవుతున్నాయంటూ తెలుపుతున్నారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకున్న వీరు సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.. ఈ ఫోటోలు చూస్తే ఖచ్చితంగా వీరిద్దరూ రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చారని సందేహాలు కూడా అందరిలో కలుగుతున్నాయి. విదేశాలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్న ఈ జంట పలు రకాల ఫోటోలను షేర్ చేయడమే కాకుండా హ్యాపీ గ్రేట్ ఫుల్ అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ జంట రిలేషన్ లో ఉన్నామంటూ ప్రకటించారు అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.. మరి సిద్ధార్థ్, అదితి తమ రిలేషన్ పైన ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.