ఆ తేదీ నుండి మొదలుకానున్న విజయ్... గౌతమ్ కాంబో మూవీ..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ హీరోగా ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి గౌతమ్ తిన్ననురి దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ బృందం ఈ సినిమా విజయ్ కెరియర్ లో 12 వ మూవీ గా తెరకెక్కనున్న నేపథ్యంలో వీడి 12 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు.


ఈ మూవీ షూటింగ్ ప్రారంభించిన తర్వాత విజయ్ , పరుశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీ ని సంక్రాంతి కి విడుదల చేయాలి అనే ఉద్దేశంలో చిత్ర బృందం గౌతమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ను కొన్ని రోజులు ఆపివేసి ఫ్యామిలీ స్టార్ మూవీ షూటింగ్ ను ఫుల్ స్పీడ్ గా తెరకెక్కించారు.


కానీ ఫ్యామిలీ స్టార్ మూవీ ని సంక్రాంతి కి కాకుండా సమ్మర్ కు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించడం తో విజయ్ , గౌతమ్ కాంబోలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ను కూడా తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ , గౌతమ్ కాంబోలో తెరకేక్కబోయే సినిమా షూటింగ్ ను మార్చి నెల నుండి తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది . ఇకపోతే ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ బిజీయేస్ట్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా కనిపించబోతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: