మహేష్ బాబు వల్లే మురళీమోహన్ నష్టపోయారా..!!

Divya
తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు మురళీమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దాదాపుగా 5 దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు గానే కాకుండా రాజకీయ నాయకుడు నిర్మాతగా కూడా రియల్ ఎస్టేట్ కింగ్ గా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈయన ఇప్పటికే తనదైన శైలిలో గుర్తింపు సంపాదించుకున్నారు.. హీరోగా వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి మధ్యలో నిర్మాతగా 25 సినిమాలను నిర్మించారట.. ప్రస్తుతం ఈయన వయసు 80 ఏళ్లు అయినప్పటికీ కూడా సినిమాలంటే ప్రాణం అంటూ నటిస్తూ ఉంటారు.

ఇలాంటి నటుడు మురళీమోహన్ నిర్మాతగా ఉన్నట్టుండి సినిమాలు తీయడం మానేశారు.. నిర్మాతగా చాలా బిజీగా ఉంటున్న సమయంలో సినిమాలు తీయడం మానేయడంతో అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు నటించిన అతడు సినిమా వచ్చి ఇప్పటికీ 18 సంవత్సరాలు అవుతోంది. అతడు సినిమా క్లాసికల్ హిట్టుగా నిలిచిన నిర్మాతగా మురళీమోహన్ కు చాలా నష్టాలను సైతం మిగిల్చిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. టీవీలో సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ అప్పట్లో థియేటర్లో కలెక్షన్స్ మాత్రం పెద్దగా ఊహించిన స్థాయిలో రాబట్ట లేకపోయిందట.

అతడు సినిమా కంటే మురళీమోహన్ ఎన్నో సినిమాలు నిర్మించారు. కానీ అవన్నీ ఫ్లాపులు అయ్యాయి అయితే సినిమాలు ఎందుకు తీయడం మానేశారనే విషయం పైన ఇప్పుడున్న పరిస్థితులు తనకు అసలు నచ్చలేదని ఈ రోజుల్లో సక్సెస్ అయితే అంతా కలిసే ఉంటారు. ఫెయిల్యూర్ అయితే మాత్రం మొత్తం నిర్మాత పైనే నెట్టేస్తున్నారని తెలిపారు. అందుకే తాను నిర్మాతగా ఎలాంటి సినిమాలను కూడా చేయడానికి ఇష్టపడలేదంటూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు మురళీమోహన్. ఏదిఏమైనా మురళీమోహన్ నిర్మాతగా సినీ ఇండస్ట్రీకి దూరం కావడానికి ముఖ్య కారణం మహేష్ బాబు నటించిన అతడు సినిమా అనే కారణమని చెప్పవచ్చు. ఇప్పటికీ అడపా దడపా సినిమాలలో నటిస్తూ ఉన్నారు మురళి మోహన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: