అదిరిపోయే ఆఫర్ కొట్టేసిన.. హీరోయిన్ మృనాల్ ఠాగూర్?

praveen
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్గా మారి పోయింది మృనాల్ ఠాగూర్. ఇక అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది అన్న విషయం తెలిసిందే. సీతారామం అనే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరు హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తో ప్రస్తుతం ఇక వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీబిజీ గానే గడుపుతుంది అని చెప్పాలి.

 ఇటీవల నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఈ మూవీ లో నాని సరసన హీరోయిన్గా నటించింది మృనాల్ ఠాగూర్. ఇక తన నటనతో అందం అభినయం తో ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమా విజయం సాధించడం తో మృనాల్ ఠాగూర్ అవకాశాలు మరింత పెరిగాయి అని చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ అమ్మడి చేతులు అర డజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సీతారామం బ్యూటీ ఇక ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయింది.

 హీరో దర్శకుడు కొరియోగ్రాఫర్ అయిన రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో తెరకేక్కుతున్న మూవీ లో మృనాల్ ఠాగూర్ అవకాశం దక్కించుకుందట. రమేష్ వర్మ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ హీరోగా తెరకేక్కుతున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. అయితే రాఘవ లారెన్స్ అందరిలా కమర్షియల్ సినిమాలు తీయకుండా విభిన్నమైన కాన్సెప్ట్ తో కూడిన సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే లారెన్స్ సినిమా అంటే మినిమం గ్యారంటీ మూవీ గా ఉంటుంది. ఇక ఇలాంటి సినిమాలో మృనాల్ ఠాగూర్ చాన్స్ తగ్గించుకుంది అంటే నిజంగా అదృష్టం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: