అమర్ దీప్ ఫై ప్రియాంకకు కోపం తగ్గలేదా.. ఏం చేసిందంటే?

praveen
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా కొనసాగుతూ ప్రేక్షకులందరికీ ఎప్పుడు వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటుంది బిగ్ బాస్ షో. అయితే ఇక ఇటీవల ఉల్టా ఫుల్టా అంటూ వినూత్నమైన కాన్సెప్ట్ తో ప్రారంభమైన బిగ్ బాస్ కార్యక్రమం.. ఎంతో గ్రాండ్ గా ముగిసింది. మునుపేన్నడు లేనివిధంగా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచడమే కాదు ఇక అదిరిపోయే రీతిలో టిఆర్పి రేటింగ్ కూడా సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇక ఎంతో రసవత్తరంగా  సాగిన బిగ్ బాస్ షోలో చివరికి కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు.

 అయితే బిగ్ బాస్ షో ముగిసి రోజులు గడుస్తున్న ఇంకా ఈ షో కి సంబంధించిన చర్చ మాత్రం అస్సలు ఆగడం లేదు. అయితే ఇక బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా వెళ్లిన అందరిని కూడా స్టార్ మా లో వివిధ షోలలో చూస్తూనే ఉన్నాం. అయితే బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత కూడా ఎందుకో ప్రియాంక తన స్నేహితుడైన అమర్ మీద ఉన్న కోపం అసలు తగ్గలేదేమో అనే భావన అందరికీ కలిగింది. ఎందుకంటే ఇటీవలే ఒక షో కి హాజరైన ప్రియాంక అమర్ విషయంలో వ్యవహరించిన తీరే ఇందుకు కారణం అని చెప్పాలి.

 ఇంతకీ ఏం జరిగిందంటే.. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా వెళ్లిన వారందరూ కూడా ఆదివారం స్టార్ మా పరివారం కార్యక్రమంలో పాల్గొనగా.. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. అయితే ఇందులో ఇక నలుగురి ఫోటోలను పెట్టి ఇక అందులో ఎవరికి ఏ ఎమోజి  ఇస్తావు అంటూ బిగ్ బాస్ లో లాగానే ప్రియాంకకు ఒక టాస్క్ ఇచ్చింది యాంకర్ శ్రీముఖి. ఈ క్రమంలోనే అమర్ కు పంచ్ ఎమోజిని ఇచ్చింది ప్రియాంక. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అయితే పల్లవి ప్రశాంత్ కి హార్ట్ బ్రేక్ గుర్తు ఇవ్వడం గమనార్హం. అయితే అమర్ కి ఎందుకు పంచ్ ఎమోజిని ఇచ్చింది అన్నది మాత్రం పూర్తి ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: