బబుల్ గమ్ లో.. డిజె టిల్లు అన్నయ్య నటించాడా?

praveen
ఇటీవల కాలం లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో వారసుల ఎంట్రీ ఎక్కువై పోయింది. అయితే ఎంతో  మంది హీరోలు నటులకు సంబంధించిన వారసులు ఇప్పటి వరకు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇటీవల దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ తనయుడు రోషన్ కనకాల ఇక హీరోగా ఇటీవల టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు అన్న విషయం తెలిసిందే. బబుల్ గమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రవికాంత్ రేవకు ఈ సినిమాకు దర్శకుడిగా పని చేశాడు. ఇక ఇందులో తెలుగమ్మాయి మానస చౌదరి కథానాయక నటించింది. డిసెంబర్ 29వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీలో తన నటనతో ప్రశంసలు అందుకున్నాడు రోషన్. అయితే ఈ సినిమాలో మరో పాత్ర కూడా బాగా హైప్ క్రియేట్ చేసుకుంది. ఇక ఇప్పుడు అందరూ ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు మూవీలో రోషన్ కనకాల తండ్రి పాత్రలో నటించిన వ్యక్తి.

 ఆయన పేరు చైతు చజోన్నలగడ్డ. చికెన్ కొట్టే యాదగిరి పాత్రలో తను నటనతో అందరి దృష్టిలో పడ్డాడు. అయితే ఈయన ఎవరో కాదు..  ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ హీరోగా కొనసాగుతున్న సిద్దు జొన్నలగడ్డకు సొంత అన్నయ్య. పక్క హైదరాబాది. ఇక ఆయన యాస డైలాగ్ చెప్పే విధానం ఈ సినిమాకు ఎంతో ప్లస్ పాయింట్ గా మారింది అని చెప్పాలి. ఇక తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అయితే చైతు జోన్నలగడ్డను చూడగానే సిద్దు పోలికలు కూడా కనిపిస్తాయి అని చెప్పాలి. అయితే బబుల్ గమ్ మూవీ చైతు జొన్నలగడ్డకు మొదటి మూవీ కావడం గమనార్హం. ఇక మొదటి సినిమాలోనే తన నటనతో ప్రశంసలు అందుకున్నాడు చైతు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: