డెవిల్ సినిమా ఎలా ఉందంటే?

Chakravarthi Kalyan
నటీ నటులు: కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగర్, సత్య
దర్శకుడు, నిర్మాత: అభిషేక్‌ నామా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్.ఎస్
విడుదల తేదీ: డిసెంబర్ 29, 2023
నందమూరి కళ్యాణ్‌రామ్‌ తాజాగా నటించిన చిత్రం డెవిల్‌. ఈ చిత్రం డిసెంబర్‌ 29 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని  దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్‌ నామా నిర్మించారు. ఈ చిత్రానికి  అభిషేక్‌ నామా దర్శకత్వం వహించారు. ఇక సంగీతం విషయానికి వస్తే హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు. సౌందర్ రాజన్.ఎస్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు.
కళ్యాణ్ రామ్ ఈచిత్రంతో హిట్టు కొట్టాలని ఆయన  అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆయన నటన ఎంతో అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది క్యాప్షన్.  కళ్యాణ్‌రామ్‌కి జోడిగా సంయుక్త మీనన్ చాలా బాగా నటించారు. బింబిసారా తరువాత  కళ్యాణ్ తో కలిసి నటించడం ఆమెకి రెండవ సినిమా బింబిసారం వంటి బ్లాక్ బస్టర్ తరువాత కళ్యాణ్ రామ్ స్పీడుగా ఉన్నారు. ఎందుకంటే అది మంచి సక్సెస్‌ని ఇచ్చిందని చెప్పాలి. ఒక డిఫరెంట్‌ కథలను ఎంచుకోవడంలో కళ్యాణ్‌ ఎప్పుడూ ముందుంటాడనాలి. బింబిసార తరువాత కళ్యాణ్ రామ్ సినిమాలు మీద ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెరిగిపోయాయి. చివరగా కళ్యాణ్ రామ్ నటించిన అమీగోస్ సినిమా షాక్ ఇచ్చింది. బోల్తా కొట్టేసింది. మూడు పాత్రల్లోనూ ఆయనే నటించడం ఎందుకో అంతగా కలిసిరాలేదని చెప్పవచ్చు. గతంలో వచ్చిన ఏ హీరో సినిమా కూడా మూడు పాత్రల్లో నటించిన చిత్రాలేవీ కూడా హిట్టయిన దాఖలాలు లేవనే చెప్పాలి.
నందమూరి కళ్యాణ్‌రామ్‌ బ్రిటిష్ ఏజెంట్ గా  ఈ చిత్రంలో కనపడ్డారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో చెప్పిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. అలానే విజువల్స్, సంయుక్త పాత్ర, ప్రొడక్షన్ క్వాలిటీ ఇవన్నీ కూడా చాలా బాగా కూదిరాయి.  సినిమా సూపర్ హిట్ అవుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఎంత మంచి స్పందన వచ్చిందో.. రిలీజ్‌ అయ్యాక కూడా అంతే బావుంది. ఈ సినిమా  సెన్సార్ బోర్డు  యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది ఈ సినిమాకి రెండు గంటల 36 నిమిషాల నిడివి లాక్ చేసింది. డెవిల్ చిత్రానికి సెన్సార్ సభ్యులు నుండి రెస్పాన్స్ బాగా వచ్చింది. ఈ సినిమా బాగుందని అభినందించారట ఇందులో వచ్చే థ్రిల్లింగ్ ఎపిసోడ్ యాక్షన్ సీన్స్‌ చాలా బాగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అలానే మూవీలో కొన్ని కొన్ని సీన్స్ చాలా సర్‌ప్రైజింగ్‌ గా ఉంటాయి. బింబిసారా తరువాత కళ్యాణ్ రామ్ కి ఈ మూవీ సక్సెస్ ఇచ్చినట్టే. బ్రిటిష్ కాలంలో జరిగే ఫిక్షనల్ స్టోరీ కనుక సహజంగానే కాస్త ఆసక్తిగా ఉంది.
రేటింగ్‌: 3.25

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: