వరుసగా బాలీవుడ్ లో అలాంటి రికార్డ్ సృష్టించిన ప్రభాస్..!!

Divya
టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అభిమానులను మెప్పిస్తూనే ఉంటారు.. ప్రభాస్ సినిమా ఏదైనా విడుదల అయ్యిందంటే పాజిటివ్ టాక్ వచ్చిందంటే కచ్చితంగా రికార్డుల మూత మోగుతుందని చెప్పవచ్చు.అలా ఎన్నో చిత్రాల తో సైతం తనని తాను నిరూపించుకున్నారు ప్రభాస్. ఇటీవలే ప్రభాస్ నటించిన సలార్ సినిమా కూడా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో కూడా 100 కోట్ల రూపాయల మార్కును అందుకున్నట్లు తెలుస్తోంది.


ఈ సలార్ సినిమాతో ప్రభాస్ దాదాపుగా 5 సినిమాలు బాలీవుడ్లో 100 కోట్ల రూపాయల మార్కుల అందుకున్న ఘనత దక్కించుకున్నారు. గతంలో బాహుబలి, బాహుబలి-2, సాహో, ఆది పురుష్ వంటి చిత్రాలతో 100 కోట్ల మార్కుల సైతం బాలీవుడ్ లో అందుకోవడం జరిగింది. ఇప్పుడు సలార్ సినిమాతో మరొకసారి 100 కోట్లు మార్కులు అందుకొని.. ఏ టాలీవుడ్ హీరో కి దక్కని ఒక అరుదైన గౌరవాన్ని సైతం దక్కించుకున్నారని చెప్పవచ్చు.. ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో భారీ హోప్స్ ఏర్పడుతున్నాయి.


ప్రస్తుతం ప్రభాస్ సినిమాల లైనప్ విషయానికి వస్తే.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి అనే భారీ ప్రాజెక్టులో నటిస్తూ ఉన్నారు.. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఒక హర్రర్ చిత్రంలో కూడా నటిస్తూ ఉన్నారు. ఈ రెండు సినిమాలు అయిపోయిన వెంటనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యారు ప్రభాస్. ఇవన్నీ అయిపోగానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్-2 చిత్రాన్ని తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఏదిఏమైనా ప్రభాస్ లైనప్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సైతం తిరగరాసేలా కనిపిస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం ప్రభాస్ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: