తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగినటువంటి యువ నటులలో తేజా సజ్జ ఒకరు. ఈయన ఇప్పటికే అనేక సినిమాలలో జూనియర్ ఆర్టిస్ట్ గా నటించగా కొన్ని సినిమాలలో హీరోగా కూడా నటించాడు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన జాంబీ రెడ్డి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. అలాగే ఇందులో తేజ నటనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి కూడా మంచి ప్రశంసలు లభించాయి. తేజ , ప్రశాంత్ కాంబోలో తాజాగా హనుమాన్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి యూ చిత్ర బృందం వారు అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ సినిమాకి బుక్ మై షో అప్ లో కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. విడుదలకు ఇంకా చాలా రోజులు మిగిలి ఉండగానే ఈ సినిమా బుక్ మై షో యాప్ లో 100 కే ఇంట్రెస్ట్ లను సాధించింది.
ఒక విధంగా చూసుకుంటే ఈ సినిమాకు బుక్ మై షో యాప్ లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది అని చెప్పవచ్చు. తేజ , ప్రశాంత్ కాంబో లో రూపొందిన జాంబి రెడ్డి మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో వీరి కాంబోలో రూపొందిన రెండవ మూవీ అయిన హనుమాన్ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ప్రేక్షకుల అంచనాలను హనుమాన్ సినిమా అందుకుంటుందో లేదో తెలియాలి అంటే వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.