టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సలార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా ... పృథ్వీరాజ్ సుకుమారన్ , జగపతి బాబు ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ డిసెంబర్ 22 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది.
ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా దక్కాయి. అందులో భాగంగా ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్ లను రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా 2 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది అనే విషయాలను తెలుసుకుందాం.
ఈ మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 33.60 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా ... సిడెడ్ ఏరియాలో 9.45 కోట్లు , యూఏ లో 7.04 కోట్లు , ఈస్ట్ లో 5.90 కోట్లు , వెస్ట్ లో 3.87 కోట్లు , గుంటూరు లో 5.60 కోట్లు , కృష్ణ లో 3.53 కోట్లు , నెల్లూరు లో 2.53 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే 2 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 71.52 కోట్ల షేర్ ... 104.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ఈ మూవీ రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.