వావ్:చిరంజీవినే మెప్పించిన ప్రభాస్ సలార్ మూవీ..!!
సలార్ సినిమా ఘనవిజయాన్ని అందుకున్న సందర్భంగా ప్రభాస్ కు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు, చిత్ర బృందానికి సైతం చిరంజీవి అభినందనలు తెలియజేస్తూ ఒక పోస్ట్ షేర్ చేశారు.. హృదయ పూర్వక అభినందనలు మై డియర్ దేవా అంటూ ఒక పోస్ట్ షేర్ చేసిన చిరంజీవి ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద సలార్ సినిమా మంటలు పుట్టిస్తోంది అంటూ ప్రశంసించడం జరిగింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు కూడా అభినందనలు తెలియజేశారు. ఈ ప్రపంచ నిర్మాణంలో మీరు అద్భుతంగా రాణిస్తున్నారు అంటూ కూడా తెలియజేశారు.
అలాగే హీరో పృథ్వీరాజ్ సుకుమార శృతిహాసన్ జగపతిబాబు ఎంతో అద్భుతంగా నటించారని వీరందరికీ తన అభినందనలు అంటూ తెలియజేశారు. వీరందరి తోపాటు మిగిలిన చిత్ర బృందానికి మొత్తం అభినందనలు తెలియజేశారు చిరంజీవి..చిరంజీవి పృథ్వీరాజ్ సైతం స్పందిస్తూ థాంక్యూ సార్ అంటూ రిప్లై ఇచ్చారు.. ప్రభాస్ అభిమానులు అయితే థాంక్యూ బాస్ అంటూ పలు రకాలుగా రిప్లై ఇస్తున్నారు.. ఏది ఏమైనా ప్రభాస్ మీద ఉండే అభిమానాన్ని సైతం చిరంజీవి ఇలా తెలియజేయడంతో అందరూ సంతోషిస్తున్నారు వాస్తవానికి రామ్ చరణ్ ప్రభాస్ ఇద్దరు కూడా మంచి మిత్రులని గతంలో కూడా సోషల్ మీడియా వేదికగా వీరిద్దరికి సంబంధించిన పలు పోస్టులు వైరల్ గా మారాయి.