శేఖర్ మాస్టర్ కు హీరోయిన్ తో ఎఫైర్ ఉందా.. లీక్ చేసిన యాంకర్?
ఇక సోషల్ మీడియాలో కూడా శేఖర్ మాస్టర్ కు ఫాలోవర్ల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. ఇక ప్రస్తుతం ఢీ షోలో జడ్జి గా కొనసాగుతూ ఉన్నాడు శేఖర్ మాస్టర్. అయితే ఇటీవల ఏకంగా శేఖర్ మాస్టర్ గురించి యాంకర్ శివ నోరు జారాడు. ఒక హీరోయిన్ తో శేఖర్ మాస్టర్ కు అఫైర్ ఉంది అంటూ స్టేజి మీద లీక్ చేశాడు. ఇక ఇందుకు సంబంధించిన ప్రోమో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవల ప్రసారమయ్యే ఢీ షోకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది ఇక ఈ షో ఎంతో మంది కొరియోగ్రాఫర్స్ కి ఇక సినిమాల్లో అవకాశాలు వచ్చేలా చేసి సరి కొత్త జీవితాన్ని ప్రసాదించింది అని చెప్పాలి.
అయితే ఇక ఇటీవల ఈ షో కి సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ప్రోమోలో నందు యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు షోలో పలువురు సెలబ్రిటీలు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే శేఖర్ మాస్టర్ తనదైన రీతిలో డాన్స్ పెర్ఫార్మన్స్ పై కామెంట్ చేశారు. ఇక మరో జడ్జిగా హీరోయిన్ ప్రణీత కూడా ఉంది అయితే ఈ ప్రోమోలో యాంకర్ శివా చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి శేఖర్ మాస్టర్ మిమ్మల్ని ఒకటి అడగాలి అంటూ నోరు జారాడు. మీకు ఒక హీరోయిన్తో ఎఫైర్ ఉందని బయట రూమర్స్ నడుస్తున్నాయి అంటూ శివ అడుగుతాడు. దీంతో శేఖర్ మాస్టర్ సీరియస్ అవుతాడు. ఎవడ్రా వీన్ని తీసుకువచ్చింది అని మండిపడతాడు శేఖర్ మాస్టర్.