స్లోగా పుంజుకుంటున్న డంకి..?

Purushottham Vinay
బాలీవుడ్ టాప్ హీరో బాద్షా షారుఖ్ ఖాన్ వరుస ప్లాప్స్ తర్వాత ఈ సంవత్సరం ఈ వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో భారీ కం బ్యాక్ ఇచ్చాడు. దాదాపు ఐదేళ్లుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన షారుక్ ఖాన్ ఈ ఇయర్ పఠాన్, జవాన్ సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేశాడు.పఠాన్ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తే జవాన్ సినిమా మాత్రం అంతకుమించి 1150 కోట్ల వసూళ్లు రాబట్టి ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీ లోనే ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకున్న హీరోగా షారుక్ ఖాన్ క్రేజ్ ని పది రెట్లు పెంచేసాయి. అయితే ఇంత పెద్ద హిట్ సినిమాలు కూడా షారుక్ లేటెస్ట్ మూవీ 'డంకి' సినిమాని కాపాడలేకపోయాయి. షారుక్ ఖాన్ ఇమేజ్, రాజ్ కుమార్ హిరాని బ్రాండ్ తో డిసెంబర్ 21న ప్రేక్షకులు ముందుకు వచ్చిన 'డంకీ' సినిమా కొన్నిచోట్ల నెగిటివ్ టాక్ ని మరికొన్ని చోట్ల డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది.  డే వన్ షేర్ కలెక్షన్స్ రూ.30 కోట్లు ఇంకా గ్రాస్ 58 కోట్లు మాత్రమే వచ్చాయి.



ఇంత తక్కువ వసూళ్లు రావడానికి కారణం భారీ అంచనాలే. పైగా ఈ సినిమా కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదల అయ్యింది. అందువల్ల నార్త్ ఏరియాలోనే ఆడుతుంది తప్ప ఎక్కడ ఆడట్లేదు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం డే 2 నుంచి ఈ సినిమాకి వసూళ్లు పెరిగాయి. స్లోగా ఈ సినిమా జనాల్లోకి వెళుతుంది.ఖచ్చితంగా మున్ముందు ఈ సినిమా భారీ వసూళ్లు నమోదు చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.జవాన్ మూవీతో 100 కోట్ల ఓపెనింగ్, పఠాన్ తో 90 కోట్ల ఓపెనింగ్ రాబట్టిన షారుక్ డంకీ తో కనీసం సగం కూడా కలెక్ట్ చేయలేకపోవడం నిజంగా బాధాకరం.రాజ్ కుమార్ హిరాని గత సినిమాలతో పోల్చితే 'డంకీ' అంత గొప్ప సినిమా కాదని తేల్చేస్తున్నారు సినీ విశ్లేషకులు. సినిమాలో షారుక్ ఖాన్ పర్ఫామెన్స్ బాగున్నా ఎమోషన్ పెద్దగా కనెక్ట్ కాకపోవడమే సినిమాకి అతిపెద్ద మైనస్. కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తక్కువగానే ఉంది కాబట్టి అతి త్వరలో ఈ సినిమా ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: